Breaking News

‘డియర్‌ కామ్రేడ్‌’కి మళ్లీ డిలే తప్పదా!


‘గీతగోవిందం, ట్యాక్సీవాలా’ల తర్వాత విజయ్‌దేవరకొండ భరత్‌కమ్మ అనే నూతన దర్శకునితో రష్మికా మందన్న జంటగా ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం చేస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనూహ్యంగా ఇతర దక్షిణాది భాషల్లో కూడా విజయ్‌దేవరకొండకి వచ్చిన ఫాలోయింగ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు ఈమూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. వేసవి చివరగా మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అదే రోజున తమిళస్టార్‌ సూర్య సెల్వరాఘవన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఎన్జీకే’ కూడా విడుదలను ఫిక్స్‌ చేసుకుంది.

నందగోపాలకృష్ణ కూడా అదే తేదీన విడుదల కావడమే కాదు.. సూర్య చిత్రం అంటే తమిళంతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదల అవుతుంది. మరోవైపు శర్వానంద్‌ గ్యాంగ్‌స్టర్‌గా కాజల్‌ హీరోయిన్‌గా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందే చిత్రం, చియాన్‌ విక్రమ్‌ హీరోగా కమల్‌హాసన్‌ నిర్మాణంలో ‘కదరం కొండేన్‌’లు విడుదల కానున్నాయి. ఇలా మూడు నాలుగు చిత్రాల పోటీలో ‘డియర్‌ కామ్రేడ్‌’ని రిలీజ్‌ చేయడం శ్రేయస్కరం కాదని నిర్మాతలు భావిస్తున్నారు. మొదటిసారిగా విజయ్‌ నటించిన ఈ చిత్రం దక్షిణాది నాలుగు భాషల్లో విడుదల కానున్న నేపధ్యంలో మిగిలిన చిత్రాల వల్ల చిత్రానికి మైనస్‌ అయ్యే అవకాశం ఉందని భావించిన మైత్రి మూవీమేకర్స్‌ సంస్థ, భరత్‌కమ్మ, విజయ్‌ దేవరకొండలు ఈ చిత్రాన్ని పోస్ట్‌పోన్‌ చేసినట్లు సమాచారం.

సోలోగా ఈ మూవీని జూన్‌ 19న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ స్టూడెంట్‌ యూనియన్‌ లీడర్‌ పాత్రను పోషిస్తుండగా, రష్మికా మందన్న ఆయన సరసన నటిస్తోంది. ఆమె పాత్ర క్రికెట్‌ ప్లేయర్‌ పాత్ర అని తెలుస్తోంది. మొత్తానికి విజయ్‌ దేవరకొండ చిత్రం రెండు వారాలు ఆలస్యంగా రావడం మిగిలిన చిత్రాలకు కాస్త ఊరడింపే కాదు.. ‘డియర్‌ కామ్రేడ్‌’కి కూడా మంచిదే అని అర్ధమవుతోంది. ఇప్పటికే ట్రైలర్‌, లిప్‌లాక్‌లతో అదరగొట్టిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం ట్రైలరే అంత సంచలనం సృష్టిస్తే సినిమా మరెంతగా సంచలనాలకు వేదిక అవుతుందో వేచిచూడాల్సివుంది. 



By April 23, 2019 at 11:47AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45647/vijay-deverakonda.html

No comments