Breaking News

‘గల్లీబాయ్’ రీమేక్‌కు హీరో ఫిక్సయినట్టేనా?


బాలీవుడ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలైన ‘గల్లీబాయ్‌’ ఎంత సక్సెస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా ఆలియా భట్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రం దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొంది బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద రూ.230 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు.

అయితే ఇప్పుడు ఈచిత్రంను తెలుగు రీమేక్ చేయాలనీ డిసైడ్ అయ్యారు మన మేకర్స్. ఇందులో సాయిధరమ్ తేజ్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.  అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే నిర్మాతలు విజయ్ ను సంప్రదింపగా ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

విజయ్ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అలానే నిన్ను కోరి, మజిలీ ఫేమ్  శివ నిర్వాణతోనూ ఓ మూవీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.



By April 18, 2019 at 08:25AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45583/vijay-devarakonda.html

No comments