Breaking News

వార‌ణాసిలో ఇస్మార్ట్ శంక‌ర్ ఫైట్


ఎన‌ర్జిటిక్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. డ‌బుల్ దిమాక్ హైద‌రాబాది అనేది ట్యాగ్ లైన్‌. ఈ సినిమా భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ రేప‌టి (బుధవారం) నుండి వారణాసిలో చిత్రీక‌రించ‌నున్నారు. సినిమా కీల‌క ఘ‌ట్టంలో ఈ యాక్ష‌న్ పార్ట్ ఉంటుంది. కాబ‌ట్టి డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ భారీ రేంజ్‌లో ఈ సీక్వెన్స్‌ని తెర‌కెక్కిస్తున్నారు. హైద‌రాబాద్ నుండి సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వార‌ణాసి వెళుతున్నారు. పూరి స్ట‌యిల్లో రియ‌ల్ స‌తీష్ ఈ యాక్ష‌న్ పార్ట్‌ను తెర‌కెక్కించ‌బోతున్నారు. 

లీడ్ పెయిర్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌తో ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, దీప‌క్ శెట్టి, తుల‌సి త‌దిత‌రులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. 



By May 01, 2019 at 07:37AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45748/ismart-shankar.html

No comments