Breaking News

మెగా ఫ్యామిలీ వైపు ‘జెర్సీ’ దర్శకుని పయనం?


తెలుగులో శేఖర్‌కమ్ముల, క్రిష్‌, బొమ్మరిల్లు భాస్కర్‌ వంటి వారి తర్వాత ఎమోషన్స్‌ని పండించడంలో గౌతమ్‌ తిన్ననూరి తన సత్తా చాటాడు. ‘మళ్ళీరావా, జెర్సీ’లలో ఆయన పండించిన ఎమోషన్స్‌ని గురించి ఎంత గొప్పగా పొగిడినా తక్కువే. ముఖ్యంగా సోషల్‌మీడియా అంతటా ఇదే సినిమా చర్చ, దర్శకుడు గౌతమ్‌ గురించే సాగుతోంది. కన్నీరు పెట్టుకున్నామని అందరు గొప్పగా చెబుతున్నారు. మరి గౌతమ్‌తిన్ననూరి తదుపరి చిత్రం ఏమిటి? అనే విషయంలో చర్చ సాగుతోంది. తనకి కొంతకాలం రెస్ట్‌ కావాలని స్వయంగా ఆయనే ప్రకటించాడు. అంతేకాదు.. తన వద్ద ఎన్నో కథలు ఉన్నాయని చెప్పాడు. 

ఇది ఇలా ఉంటే ‘జెర్సీ’ అభినందన సభలో దిల్‌రాజు ఈ చిత్రంపై, దర్శకుడు గౌతమ్‌, హీరో నానిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘యాత్ర’ తరహాలోనే ఈ చిత్రం ప్రమోషన్స్‌లో కూడా ముందున్నాడు. ‘అజ్ఞాతవాసి’ నష్టాలను ఈ చిత్రం ద్వారా పూడ్చుకోమని హారిక అండ్‌ హాసిని సంస్థ చెప్పడంతోనే దిల్‌రాజు చిత్రం ముందు ఏమీ మాట్లాడకుండా విడుదలైన తర్వాత సొంత చిత్రాని కన్నా బాగా ప్రమోట్‌ చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది. ఇక గౌతమ్‌ తిన్ననూరి మూడో చిత్రాన్ని దిల్‌రాజు లాక్‌ చేశాడని సమాచారం. ఈ చిత్రం మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌తో ఉంటుందిట. ఇప్పటికే దిల్‌రాజు, వరుణ్‌తేజ్‌ల కాంబినేషన్‌లో ‘ఫిదా, ఎఫ్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ వచ్చాయి. గౌతమ్‌ తిన్ననూరి చిత్రం ఓకే అయితే హ్యాట్రిక్‌ చిత్రం అవుతుందనడంలో సందేహం లేదు. 

మరోవైపు గౌతమ్‌, ఎన్టీఆర్‌కి కూడా ఓ స్టోరీ లైన్‌ చెప్పాడని, అది బాగా నచ్చడంతో డెవలప్‌ చేయమని ఎన్టీఆర్‌ చెప్పాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా మెగా క్యాంప్‌కి చెందిన నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ చొరవతో గౌతమ్‌, చరణ్‌కి ఓ స్టోరీ చెప్పాడట. ఈ చిత్రం ఓకే అయితే ఎన్వీప్రసాదే నిర్మాతగా వ్యవహరించడం ఖాయం. అయితే రామ్‌చరణ్‌కి గతంలో ఇలాగే సెన్సిబుల్‌ చిత్రాలు తీసే బొమ్మరిల్లు భాస్కర్‌ చిత్రానికి అవకాశం వస్తే ఆయన ఆరెంజ్‌ వంటి డిజాస్టర్‌ ఇచ్చాడు. ఈ ఎమోషన్స్‌ అనేవి ఓ రేంజ్‌ వరకే వర్కౌట్‌ అవుతాయని, మాస్‌ ఇమేజ్‌ బాగా ఉన్న వారితో ఇలాంటివి అటెమ్ట్‌ చేయడం కష్టమని కొందరు అంటున్నారు. 



By April 25, 2019 at 11:10AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45673/gautham-thinnanuri.html

No comments