Breaking News

సమంత, చైతూ హనీమూన్‌పై వార్తలు


పెళ్లి తరువాత ఇద్దరూ కలిసి చేసిన సినిమా మజిలీ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్ సైతం ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఇక ఈ సినిమా తరువాత సమంత మూడు వారాలపాటు గ్యాప్ తీసుకుని నెక్స్ట్ మూవీ షూట్ పై ద్రుష్టి పెట్టనుంది. అలానే తన భర్త చైతు కూడా ఒక వీక్ గ్యాప్ తీసుకుంటే చక్కగా ఇద్దరూ కలిసి హాలిడే వెళదాం అని అనుకుంది సామ్.

కానీ పాపం సామ్ కు తన భర్త చైతు అంత ఛాన్స్ ఇవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయాడు. మజిలీ సినిమా తరువాత చైతు వెంకీ మామ సెట్స్ కి వెళ్ళిపోయాడు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా జరగనుంది. వెంకీమామ కంప్లీట్ అవ్వగానే దిల్ రాజు బ్యానర్ లో శశి అనే దర్శకుడుతో మరో సినిమా చేయనున్నాడు చైతు.

సో ఇలా గ్యాప్ లేకుండా చైతు వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. పెళ్లి తరువాత వరస సినిమాలతో బిజీ అయినా చైతు ఇంతవరకు హనీమూన్ కూడా ప్లాన్ చేసుకోలేదు. ఇలా ఇద్దరూ తమ సినిమాలతో బిజీ అయిపోవడంతో కుదరడం లేదు.



By April 16, 2019 at 12:22PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45553/samantha.html

No comments