Breaking News

అది బాలకృష్ణ దిగజారుడుతనం: షర్మిళ


ప్రముఖ హీరో ప్రభాస్‌, వైఎస్‌ తనయ, జగన్‌ సోదరి షర్మిల మధ్య అక్రమ సంబంధం అంటగడుతూ సామాజిక మాధ్యమాలలో బాగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీని వెనుక ఎవరు ఉన్నారు? అసలు దీనిని ప్రచారం చేయించిన పెద్ద మనిషి ఎవరు? అనే విషయంపై ఎప్పటి నుంచో చర్చ సాగుతోంది. ఈ విషయమై షర్మిల హైదరాబాద్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ విషయంపై తాజాగా షర్మిల మాట్లాడుతూ, 2014 నుంచి ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇవేవో పుకార్లు అని నేను పట్టించుకునే దానిని కాదు. మరలా ఈ సారి ఎన్నికలు వచ్చేసరికి ఈ పుకార్లు మొదలయ్యాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ ప్రచారం సాగుతోందని నాకు అర్ధమైంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పని చేసింది టీడీపీయే. ఎన్నికలు సమీపించే కొద్ది ఈ ప్రచారం మరింత ఉదృతం చేస్తారని నాకు అర్ధమైంది. వ్యక్తిగతంగా దీనిపై మాట్లాడటం నాకు ఇబ్బందికరమే అయినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. పోలీసులు చెబుతున్న దానిని బట్టి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 36లో ఎన్బీకే అనే పేరుతో బిల్డింగ్‌ ఉంది. ఆ బిల్డింగ్‌ నందమూరి బాలకృష్ణది. అక్కడి నుంచే ఈ దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్‌లను బట్టి పోలీసులు చెబుతున్నారు. 

ఈ బిల్డింగ్‌ నుంచి నాపై జరిగిన దుష్ప్రచారం ఒక ఎత్తైతే.. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని వెబ్‌సైట్స్‌ చేసిన దుష్ప్రచారం మరో ఎత్తు. బాలకృష్ణ బిల్డింగ్‌ నుంచి ఇంత జరుగుతుంటే అది బాలకృష్ణకి తెలియదని ఎలా అనుకోవాలి? కేవలం బాలకృష్ణనే నాపై ఈ విషప్రచారం చేయించాడు. వాటిని ప్రచారం చేశారని నేను నమ్ముతున్నాను. బాలకృష్ణ ఇంత దిగజారుడు పనికి ఎలా పాల్పడ్డారో ఆయనే చెప్పాలి అని చెప్పుకొచ్చింది. నిజమే ఆడవాళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు పుకార్లుగా రావడం బాధాకరమే. అయినా మగాడికైనా ఇవి ఇబ్బందిని కలిగించేవే. తనపై జరిగిన దుష్ప్రచారంపై ఇంత బాధపడుతున్న షర్మిల తన సోదరుడు జగన్‌, పవన్‌ వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు ఏమని సమాధానం చెబుతుంది...? 



By April 09, 2019 at 07:22AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45471/sharmila.html

No comments