Breaking News

విజయ్ కన్నడభామల్ని లైన్లో పెడుతున్నాడు


తమ చిత్రాలను ప్రేక్షకులకు దగ్గర చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కోశైలి. సినిమా విడుదలకు సమయం దగ్గర పడే కొద్ది ప్రమోషన్స్‌ని ఎంతో డిఫరెంట్‌గా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ చిత్రాలను ఇతర భాషల వారికి దగ్గర చేసేందుకు కొందరు అనుసరించే పోకడలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇలాంటి వాటిల్లో అతి తక్కువ సమయంలోనే తనకంటే ప్రత్యేక పంధాని ఏర్పరచుకున్న స్టార్‌ విజయ్‌ దేవరకొండ. ఈ రౌడీస్టార్‌ అతి తక్కువ చిత్రాలతోనే దక్షిణాదిలోనే కాక బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా తనవైపుకు తిప్పుకుంటున్నాడు. 

ఇక మలయాళ చిత్ర పరిశ్రమపై మన స్టార్స్‌ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. అల్లుఅర్జున్‌ ఈ పంథాకి నాంది పలికితే బాహుబలితో దానిని ప్రభాస్‌ మరింత పటిష్టం చేశాడు. టాలీవుడ్‌ స్టార్స్‌ విషయానికి వస్తే అల్లుఅర్జున్‌ని మలయాళంలో మల్లూ అర్జున్‌ అని పిలిచేలా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. తెలుగులో సరిగా ఆడని ఆయన చిత్రాలు మలయాళంలో మాత్రం మంచి వసూళ్లు సాధిస్తూ ఉండటం విశేషం. ఇప్పుడు విజయ్‌దేవరకొండ కూడా తన రాబోయే చిత్రాలను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అందుకోసం తన చిత్రాలలో హీరోయిన్ల నుంచి అన్ని విషయాలలో కూడా దక్షిణాది భాషల్లో తన చిత్రాలకు క్రేజ్‌ తేవడం ఎలా? అనే విషయంపై దృష్టిసారించాడు. 

ప్రస్తుతం ఆయన భరత్‌కమ్మ దర్శకత్వంలో డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీకి తెలుగు, తమిళంలో ఎలాగూ క్రేజ్‌ వచ్చింది. ఇక కన్నడ ప్రేక్షకులను అలరించేందుకు గీతగోవిందం తర్వాత మరోసారి రష్మికా మందన్నతో జోడీ కడుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను కేరళలోని అందమైన ప్రకృతి ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. కేరళలోని అతిరాపల్లి ఫాల్స్‌ వద్ద ఓ పాటను చిత్రీకరించారని సమాచారం. ఈ సందర్భంగా విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్నలు పది మంది కేరళ యువతులతో ఫొటో దిగారు. వారంతా కేరళ సంప్రదాయ దుస్తులలో తెల్ల చీరలు కట్టుకుని ఉన్నారు. ఈ చిత్రాన్ని మే 31న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు. ఈ ఫొటో పుణ్యమా అని ఈ చిత్రంతో పాటు విజయ్‌, రష్మికలు కేరళీయులకు కూడా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని అర్ధమవుతోంది. 



By April 16, 2019 at 02:53PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45559/vijay-deverakonda.html

No comments