చిన్నారిని కాపాడిన ఫైర్‌మెన్‌కు చిరు అభినందన

చిన్నారిని మృత్యువు నుండి కాపాడిన ఫైర్ మెన్ శ్రీ క్రాంతికుమార్‌ను అభినందించిన మెగాస్టార్ శ్రీ చిరంజీవి
భారీ వర్షాలు సందర్భంగా ప్రమాదవశాత్తు గౌలీగూడ (హైదరాబాద్) నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు నుండి కాపాడారని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే శ్రీ క్రాంతి కుమార్‌ను అభినందించారు.
ఫైర్‌మెన్ క్రాంతి కుమార్‌కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టు అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
క్రాంతి కుమార్‌కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ Station Fire Officer (SFO) శ్రీ జయరాజ్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా రక్షింపబడ్డ 4సం,,ల బాలికను కూడా ఆదుకుంటామని అల్లు అరవింద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున ఆర్. స్వామినాయుడు పాల్గొన్నారు.
By April 24, 2019 at 07:58AM
No comments