Breaking News

‘కల్కి’.. రాజశేఖర్‌కు ఎక్కువ పెట్టేశారట!


‘గరుడ వేగ’తో సూపర్ హిట్ అందుకున్న హీరో రాజశేఖర్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దశలోనే ఉండగానే హీరో రాజశేఖర్ పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాలు వార్తలు వస్తున్నాయి.

ఇందులో రాజశేఖర్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని.. సినిమాలో రాజశేఖర్ యాక్షన్ సీన్స్ మరి ఎక్కువయ్యాయని.. ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఫుల్ యాక్షన్ మూడ్‌లోనే సాగుతుందని తెలుస్తోంది. మరి రాజశేఖర్ మీద మోతాదుకు మించిన యాక్షన్ వర్కౌట్ అవుతుందా..? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ‘అ’ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ‘గరుడ వేగ’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాజశేఖర్‌తో చేస్తుండటంతో ఈ సినిమాపై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో నందిత శ్వేతా, ఆదా శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సి కళ్యాణ్, రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయినా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.



By April 21, 2019 at 06:59AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45608/kalki.html

No comments