Breaking News

బయటకు రావడానికి లారెన్స్‌కు భయమా?


రాఘవ లారెన్స్ గొప్ప కొరియోగ్రాఫర్. చిరంజీవి లాంటి వారికీ డాన్స్ మాస్టర్ గా పనిచేసిన రాఘవ అందరి డాన్స్ మాస్టర్స్ వలే.. మెగా ఫోన్ పట్టాడు. రెబల్, స్టైల్ వంటి చిత్రాలు డైరెక్ట్ చేసిన రాఘవ లారెన్స్ కి ఆ చిత్రాలు గొప్ప పేరైతే తీసుకురాలేకపోయాయి. అందుకే హర్రర్ కామెడీని నమ్ముకున్న రాఘవ లారెన్స్ ముని సీక్వెల్ కి తెరలేపాడు. ఏదో ఒకటి రెండు సినిమాలను హర్రర్ థిల్లర్ గా భయపెడితే ప్రేక్షకులు మెచ్చుతారు. ఏకంగా ఒకే స్టోరిమీద వరసగా నాలుగు సినిమాలంటే అది చివరికి రొటీన్ గానే మారిపోతుంది.

తాజాగా మాస్ ని టార్గెట్ చేసి కాంచనకి సీక్వెల్ గా కాంచన 3 తెరకెక్కించాడు రాఘవ లారెన్స్. కాంచన, గంగ సినిమాల్లో చూసిన సీన్స్ అన్ని కాంచన 3 లో కనబడడం... రొటీన్ గా కాంచన 3 ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా... అసలు అక్కడక్కడా కూడా ప్రేక్షకుడు హర్రర్ కామెడీని ఎంజాయ్ చెయ్యలేకపోయాడు. మరి ముని, కాంచన, గంగ, కాంచన 3 తీసి ప్రేక్షకుల మీదకి వదిలిన రాఘవకి కమర్షియల్ చిత్రాలు చెయ్యాలంటే భయమా? లేదంటే అవి వర్కౌట్ అవ్వవు.. హర్రర్ మూవీస్ తోనే బండి లాగించేద్దామనుకుంటున్నాడా? లేదంటే... మళ్ళీ కాంచన 3 కి సీక్వెల్ అంటూ చివరిలో ఆ ఎండ్ కార్డు ఏమిటి. అసలు రాఘవ ఆ దెయ్యాల కథల నుండి బయటికి రావా అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.



By April 21, 2019 at 11:47AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45614/raghava-lawrence.html

No comments