Breaking News

‘డార్లింగ్‌’ భలే రొమాంటిక్‌గా ఉన్నాడు!


యంగ్‌రెబెల్‌స్టార్‌గా బాహుబలితో నేషనల్‌ ఐకాన్‌గా మారిపోయిన డార్లింగ్‌ ప్రభాస్‌ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు కేవలం యాక్షన్‌ పార్ట్‌కి సంబంధించిన మేకింగ్‌ వీడియోలు, పోస్టర్స్‌ మాత్రమే విడుదలై అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న స్వాతంత్య్రదినోత్సవ కానుకగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నారు. ఇలాంటి చిత్రం నుంచి తాజాగా డార్లింగ్‌ రొమాంటిక్‌ పిక్‌ ఒకటి విడుదలై వైరల్‌ అవుతోంది. ఈ లీక్‌ అయిన స్టిల్‌లో ప్రభాస్‌, శ్రద్దాకపూర్‌లు ఎంతో రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నారు. ఒకరి కళ్లలోకి మరొకరు రొమాంటిక్‌గా చూసుకుంటూ ఉన్నారు. పింక్‌ కలర్‌ డ్రెస్స్‌లో ఉన్న శ్రద్దాకపూర్‌ రొమాంటిక్‌ లుక్‌ చూస్తే యువత పిచ్చెక్కిపోవడం ఖాయం. వైట్‌ డ్రస్‌లో ఉన్న ప్రభాస్‌ బాలీవుడ్‌.. సారీ.. హాలీవుడ్‌ రొమాంటిక్‌ హీమ్యాన్‌లా ఉన్నాడు. 

ఈ లీకయిన రొమాంటిక్‌ పిక్‌ని చూసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మైమరిచిపోతున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 300కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్స్‌ని మైమరిపించేలా తీస్తున్నారు. భారీ మల్టీ లింగ్వల్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పలు భాషా స్టార్స్‌ నటిస్తూ ఉండటం విశేషం. ఇక ప్రభాస్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా ఎంటర్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అయితే ప్రభాస్‌ ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదు. త్వరలో ఆయన సాహోకి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఇందులో పోస్ట్‌ చేయనున్నాడట. ఆయన తన ఖాతాలో ఒక పోస్ట్‌గానీ, ఫొటో గానీ పెట్టకుండానే ఆయన పేరుని చూసి దీనిని ఏడు లక్షల మంది ఫాలో అవుతుండటం విశేషం. 

తాజాగా ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాపై తమన్నా స్పందించింది. ప్రభాస్‌ని నేను ఎంతో కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రమ్మని కోరుతున్నాను. ఇప్పటికైనా వచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రత్యేకించి ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారంటూ తెలిపింది. మొత్తానికి తమన్నా వాలకం చూస్తే ప్రభాస్‌కి, ఆయన ఫ్యాన్స్‌కి బిస్కెట్‌ వేసే ప్రయత్నం చేస్తోందేమో అన్న అనుమానం రాకమానదు. 



By April 16, 2019 at 02:36PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45557/prabhas.html

No comments