Breaking News

టాప్ రైటర్‌.. తారక్‌తో డైరెక్టర్‌ అవుతున్నాడా?


రాజమౌళితో సినిమా అంటే విషయం మాములుగా ఉండదు. కనీసం రెండేళ్లు టైం పడుతుంది ఆ హీరో బయటికి రావడానికి. బయటకు వచ్చాక తమ నెక్స్ట్ మూవీ ఏంటి అని ఆలోచిస్తారు. కానీ ఎన్టీఆర్ అలా చేయడం లేదు. ప్రస్తుతం తారక్ జక్కన్న డైరెక్షన్ లో RRR అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత తారక్ తన నెక్స్ట్ మూవీస్ ఎవరితో చేయాలి అనేదానిపైన ఆల్రెడీ క్లారిటీ గా ఉన్నాడట. తారక్ తన కెరీర్లో చెయ్యబోయే 30వ సినిమాకి డైరెక్టర్ ఎవరు అన్న ప్రశ్నకు మూడు ఆప్షన్స్ ఉండేవి త్రివిక్రమ్, సుకుమార్, అట్లీ. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొకరు వచ్చారు.

కానీ ఆయన డైరెక్టర్ కాదు. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా  ఆయన డైరెక్ట్ చేయలేదు. కాకపోతే పేరుమోసిన రైటర్. ఎన్టీయార్ బయోపిక్, గౌతమీపుత్ర శాతకర్ణి, కంచె లాంటి ప్రెస్టీజియస్ మూవీస్‌కి డైలాగ్స్ ఇచ్చిన సాయిమాధవ్ బుర్రా తారక్ ను డైరెక్ట్ చేయబోతున్నాడట. రీసెంట్ గా ఆయన తారక్ ను కలిసి ‘ఒక మంచి లైన్ వుంది చెప్పమంటారా’ అంటూ తారక్‌ని టచ్ చేసిన బుర్రా.. సదరు స్టోరీ లైన్‌తో జూనియర్‌ని పడేశాడట. ‘స్టోరీ ని డెవలప్ చేసి మీరే డైరెక్ట్ చెయ్యండి’ అంటూ వెంటనే తారక్ బంపరాఫర్ ఇచ్చాడట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వారికే తెలియాలి. అయితే తారక్ వెంటనే చేస్తాడా? లేదా గ్యాప్ తీసుకుని చేస్తాడా అనేది తెలియాల్సిఉంది. 



By April 20, 2019 at 08:44AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45598/sai-madhav-burra.html

No comments