Breaking News

లారెన్స్‌ అంత సేపు కూర్చోబెడతాడా....?


ఇటీవల పలు చిత్రాలకు నిడివి సమస్య ఎక్కువగా ఎదురవుతోంది. అయినా కొన్ని చిత్రాలు ఆ అవరోధాలను దాటి విజయకేతనం ఎగురవేశాయి. 'బాహుబలి, రంగస్థలం, భరత్‌ అనేనేను' వంటి చిత్రాలు దాదాపు మూడు గంటలు ప్రేక్షకులను కుర్చీలకు అతక్కుపోయేలా చేయగలిగి విజయపంథా ఎగురవేశాయి. కానీ మిగిలిన సినిమాల సంగతి వేరే గానీ హర్రర్‌ చిత్రాల విషయం మాత్రం వేరు. సాధారణంగా హర్రర్‌ చిత్రాలను రెండు రెండు పావు గంటల్లో ముగించేలా ప్లాన్‌ చేస్తూ ఉంటారు. లేకపోతే అసలుకే ప్రమాదం వచ్చి భయపెట్టడం పోయి.. నిడివితో ప్రేక్షకులను భయపెట్టడం మొదలవుతుందనేది ఎంతో కాలంగా వస్తున్న నిష్ఠూర సత్యం. మూడు గంటల పాటు ప్రతి క్షణం భయపెడుతూ, టెంపోని మెయిన్‌టెయిన్‌ చేయాలంటే అది అంత సులువు కాదు. 

ఇక విషయానికి వస్తే రాఘవలారెన్స్‌ 'మాస్‌, డాన్‌, రెబెల్‌' వంటి స్టార్స్‌ చిత్రాలకు దర్శకత్వం వహించినా కూడా ఆయనకు దర్శకునిగా మంచి పేరుని తెచ్చింది మాత్రం 'ముని' సిరీస్‌ అనే చెప్పాలి. ఇప్పటికే 'ముని, కాంచన, గంగ' అంటూ కాసుల వర్షం కురిపించిన లారెన్స్‌ ఈ సారి తాను తీస్తున్న 'కాంచనత్రీ'పై మరింత ఎక్కువ థీమాగా ఉన్నాడు. ఈ చిత్రం తన గత చిత్రాలకంటే ఎక్కువగా ప్రజాదరణ పొందుతుందని, మిగిలిన భాగాల కంటే ప్రేక్షకులను భయపెడుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుంది. ఈచిత్రం పూర్తి నిడివి రెండు గంటల యాభై నిమిషాలకు పైగా వచ్చిందనే వార్త మాత్రం కాస్త ఖంగారు పెట్టే అంశమే. అంతసేపు థియేటర్లలో ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేయడం అంటే మాటలు కాదు. కానీ ఈ చిత్రం నిడివిని తగ్గించేది లేదని లారెన్స్‌ భీష్మించుకుని ఉన్నాడట. తన చిత్రంపై ఆయనకున్న నమ్మకం అలాంటిది. 

మరి ఇంత నిడివితో నిజంగా లారెన్స్‌ హిట్‌ కొడితే మాత్రం అది ఆయన కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా రిలీజ్‌ తర్వాత ఫలానా సీన్స్‌ లాగ్‌ అనిపించాయనే విషయం తెలుసుకుని థియేటర్లలో కత్తెర వేసినా కూడా జరగాల్సిన డామేజ్‌ అప్పటికే జరిగిపోయి ఉంటుంది. మరి ఈ విషయంలో లారెన్స్‌ది కాన్ఫిడెన్సా? లేక ఓవర్‌కాన్ఫిడెన్సా? అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ చిత్రం ఓకేసారి తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పోటీగా తెలుగులో నేచురల్‌స్టార్‌ నాని నటించిన 'జెర్సీ' విడుదల కానుంది. కానీ రెండు చిత్రాలు భిన్నమైన నేపథ్యాలు కలిగినవి కావడంతో ఈరెండు క్లాష్‌ కావడం వల్ల ఎవ్వరికీ ఏమీ నష్టముండదని నిర్మాతలు భావిస్తారు. 



By April 19, 2019 at 03:22AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45585/raghava-lawrence.html

No comments