Breaking News

‘కబీర్‌సింగ్‌’కి ఫ్లాట్‌ అయిన డార్లింగ్‌!


తెలుగులో మోడ్రన్‌ క్లాసిక్‌ చిత్రంగా ‘అర్జున్‌రెడ్డి’ని చెప్పవచ్చు. ఈ చిత్రం టాలీవుడ్‌లో సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. దాంతో ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. తమిళంలో చియాన్‌ విక్రమ్‌ తనయుడు దృవ్‌ ఈ చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని దేశం గర్వించదగ్గ దర్శకుడు బాలా ఎక్కువ భాగం తీయగా, అవుట్‌పుట్‌ సరగా రాలేదని మరో దర్శకునితో దీనిని రీషూట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది దక్షిణాదిన సంచలనం సృష్టించింది. 

ఇక బాలీవుడ్‌ ‘అర్జున్‌రెడ్డి’ని షాహిద్‌ కపూర్‌ హీరోగా తెలుగు వెర్షన్‌ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగానే చిత్రీకరిస్తున్నాడు. ‘ఉడ్తా పంజాబ్‌’లో డ్రగ్‌ అడిక్ట్‌గా సూపర్‌యాక్టింగ్ చేసిన షాహిద్‌ కపూర్‌ తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ ‘కబీర్‌సింగ్‌’తో కూడా అల్లాడిస్తున్నాడు. ఈ చిత్రం గురించి షాహిద్‌కపూర్‌ మాట్లాడుతూ, ఈ మూవీ కోసం ఇష్టం లేకపోయినా పొగతాగాల్సివచ్చేది. రోజుకి 20 సిగరెట్లతో పాటు బీడీలు కూడా తాగేవాడిని. ఆ తర్వాత ఆ వాసన పోవడానికి రెండు గంటలకు పైగా స్నానం చేసేవాడిని. ధూమపానం అంత సులువైన పనికాదు. పాత్ర డిమాండ్‌ చేయడంతో తప్పలేదు. కబీర్‌లోని చెడుగుణాన్ని చూపించాలంటే పొగతాగక తప్పదు అని చెప్పుకొచ్చాడు. 

తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని నేషనల్‌స్టార్‌ ప్రభాస్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న ‘సాహో’ షూటింగ్‌ స్పాట్‌లో చూసి షాహిద్‌ కపూర్‌ నటనకు ఫిదా అయ్యాడట. ఈ విషయాన్ని ముంబై హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీమ్‌ హకీమ్‌ స్వయంగా వెల్లడించారు. ఈ ట్రైలర్‌ చూసి తాను షాహిద్‌కపూర్‌తో మాట్లాడాలని ప్రభాస్‌ కోరాడని, దాంతో హకీమే స్వయంగా షాహిద్‌కి ఫోన్‌ చేసి ప్రభాస్‌ చేత మాట్లాడించాడట. ఫోన్‌ అందుకున్న ప్రభాస్‌ ఏకంగా ఏడు నిమిషాలు షాహిద్‌తో మాట్లాడాడు. ఆ మాటల్లో షాహిద్‌పై ఒకటే కాంప్లిమెంట్స్‌ వర్షాన్ని కురిపించాడని హకీమ్‌ తెలిపారు. మొత్తానికి డార్లింగ్‌ ప్రభాస్‌ మెల్లమెల్లగా బాలీవుడ్‌ స్టార్స్‌తో తన స్నేహాలను రోజు రోజుకి పెంచుకుంటున్నాడు. 

ఇక ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ చిత్రం కోసం బాలీవుడ్‌ ప్రముఖులు కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘సాహో’ చిత్రం దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల కానుండగా, షాహిద్‌కపూర్‌ ‘కబీర్‌సింగ్‌’ చిత్రం జూన్‌21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



By April 15, 2019 at 07:18AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45540/prabhas.html

No comments