Breaking News

బన్నీ, త్రివిక్రమ్ చిత్రంలో చాలా విశేషాలు!


‘డిజె’ అనుకున్న స్థాయిలో వైవిధ్యభరిత చిత్రాల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ‘నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ చిత్రం డభేల్‌మంది. దాంతో ఎన్నడు తీసుకోని లాంగ్‌ గ్యాప్‌ని అల్లుఅర్జున్‌ తీసుకున్నాడు. గీతాఆర్ట్స్‌, హారిక అండ్‌ హాసిని సంయుక్త భాగస్వామ్యంలో త్రివిక్రమ్‌తో చిత్రం మొదలుపెట్టాడు. ‘అజ్ఞాతవాసి’తో తన కెరీర్‌లో ఎన్నడు ఎదుర్కోని విమర్శలను ఎదుర్కొని, ఎన్టీఆర్‌తో ‘అరవిందసమేత వీరరాఘవ’తో మరలా పట్టాలెక్కిన త్రివిక్రమ్‌ ఈసారి బన్నీ 19వ చిత్రానికి గట్టి కసరత్తే చేశాడు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైన విషయాన్ని తెలుపుతూ యూనిట్‌ ఓ చిన్న వీడియోను విడుదల చేసింది. బన్నీ కారులోంచి దిగడం, ఆయన ఇద్దరు పిల్లల అల్లరి, అల్లుఅరవింద్‌, చిన్నబాబుల షూటింగ్‌ పర్యవేక్షణ, సినిమాటోగ్రాఫర్‌ వినోద్‌ సిద్దం, త్రివిక్రమ్‌ యాక్షన్‌లతో దీనికి ఆరంభం మొదలుపెట్టారు. 

ఇక ఈ చిత్రంలో పూజాహెగ్డే వరుసగా త్రివిక్రమ్‌ రెండో చిత్రంలో కూడా కథానాయికగా నటిస్తూ ఉండటం విశేషం. అరవింద తర్వాత త్రివిక్రమ్‌ మరోసారి సెంటిమెంట్‌, ఎమోషన్స్‌నే నమ్ముకుని ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేసినట్లు అర్ధమవుతోంది. జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్‌-బన్నీల హ్యాట్రిక్‌ చిత్రం కావడం వల్ల అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇందులో బన్నీ తండ్రిగా మలయాళం నటుడు జయరాం, తల్లి పాత్రకు తెలుగు ప్రేక్షకులను ఎప్పుడో ఫిదా చేసి స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన టబులను ఎంపిక చేసుకున్నారు. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, మరో ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. 

ఖచ్చితంగా 12 ఏళ్ల కిందట తెలుగు హీరోలలో మేకోవర్‌గా సిక్స్‌ప్యాక్‌ని మొదటిసారి సాధించి, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన దేశముదురు చిత్రంలో సన్యాసినిగా, ప్రేయసిగా పరిచయమైన యాపిల్‌ పిల్ల హన్సిక ఇందులో బన్నీకి పోటీనిచ్చే నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను చేస్తోందని సమాచారం. ఈమె తెలుగులో పలు చిత్రాలలో స్టార్స్‌తో నటించినా కూడా తర్వాత కోలీవుడ్‌కి వెళ్లి యాపిల్‌ పిల్లగా గుళ్లుగోపురాలు కట్టించుకుంది. అలాంటి బన్నీ జోడీ ఇందులో బన్నీనే సవాల్‌ చేసే నెగటివ్‌ పాత్ర అంటే ఆసక్తికరమే అని చెప్పాలి. ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి దసరాని టార్గెట్‌ చేస్తున్నారట. కానీ ‘దర్బార్‌’తో పోటీ ఎందుకులే అని ‘సై..రా’ దసరాకి వస్తే ఈ చిత్రం మరో రిలీజ్‌డేట్‌ని ఫిక్స్‌ చేసుకోకతప్పదు. 



By April 26, 2019 at 11:04AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45681/allu-arjun.html

No comments