Breaking News

త్రివిక్రమ్, పవన్ ఫ్యాన్స్‌పై అనిరుధ్‌ సెటైర్‌!


ఎంతో విస్తృతమైన క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ని తీసుకుని దానికి ఎమోషన్స్‌ జోడించి, ఫాదర్‌ సెంటిమెంట్‌ చుట్టూ కథను అందరినీ కట్టిపడేసాలా గౌతమ్‌ తిన్ననూరి తీసిన ‘జెర్సీ’పై ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెండో చిత్రంతోనే నేచురల్‌స్టార్‌ నాని గౌతమ్‌ తిన్ననూరి మీద ఉంచిన నమ్మకం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఖర్చుకు వెరవకుండా సెంటిమెంట్లను పక్కనపెట్టి చిత్రాన్ని లావిష్‌గా తీసిన విధానం చూసి అందరు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం మామూలు హిట్‌ కాదు.. బ్లాక్‌బస్టర్‌ అని మౌత్‌టాక్‌తో పాటు సోషల్‌మీడియా, వెబ్‌సైట్స్‌ రేటింగ్స్‌తో మారుమోగిపోతోంది. మంచు మనోజ్‌ నుంచి తెలుగులో బెస్ట్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లు దర్శకునితో పాటు నాని నటనను పొడుగుతున్న తీరు అద్భుతం. నిజంగా చూసి తీరాల్సిన తెలుగు క్లాసిక్‌ చిత్రాలలో ‘జెర్సీ’ కూడా తన పేరు లిఖించుకుంది. ఈ చిత్రం ప్రభావం మంచి చిత్రంగా పేరు తెచ్చుకుని ఇంకా మంచి రన్‌తో సాగుతున్న ‘మజిలీ’, సాయిధరమ్‌తేజ్‌కి జస్ట్‌ ఓకే అనిపించిన ‘చిత్రలహరి’లపై ఎక్కడ పడుతుందో అని విశ్లేషకులు గమనిస్తున్నారు. 

ఇంకా ‘మజిలీ’ చూడని వారు ఒకే సినిమాని చూడాలని ఎంచుకోవాల్సి వస్తే ‘జెర్సీ’కే ఓటేస్తారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇక ‘జెర్సీ’ టీం మొత్తం సినిమా విడుదల ముందు నుంచి ఈ చిత్రంపై ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం వేడుకలో గౌతమ్‌ తిన్ననూరి భార్య, కుమారుడితో నాని చెప్పిన మాటలే దానికి నిదర్శనం. అయినా ఈ చిత్రం విడుదల వరకు సంగీత దర్శకుడు, తమిళ నెంబర్‌వన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ మాత్రం మౌనమే వహించాడు. ‘అజ్ఞాతవాసి’ టైంలో పలు విధాలుగా సోషల్‌మీడియాలో హడావుడి చేసిన ఆయన ‘జెర్సీ’కి వచ్చేసరికి మౌనవ్రతం దాల్చాడు. ఈ చిత్రం పాటలు విడుదలైనప్పుడు కూడా పెద్దగా క్రేజ్‌ రాలేదు. ఆల్బమ్‌ ఓకే అన్నారే గానీ మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టర్‌ అని పొగడ్తలు లేవు. 

కానీ సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రానికి అనిరుధ్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చిన విధానం సినిమాని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లిందన్న ప్రశంసలు లభిస్తున్నాయి. దీనిపై అనిరుధ్‌ ‘నాపనై పోయింది అన్నారుగా’ అంటూ తన ట్విట్టర్‌లో సెటైరిక్‌ వీడియోను పెట్టడంతో ఇది ఎవరిని ఉద్దేశించి అనే చర్చ మొదలైంది. ‘అజ్ఞాతవాసి’ టైంలో తనని ట్రోల్‌ చేసిన పవన్‌ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి అని కొందరు... కాదు.. కాదు ‘అజ్ఞాతవాసి’ సమయంలోనే తదుపరి ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానికి అనిరుధ్‌ సంగీత దర్శకుడు అని ప్రకటించి మరీ అవమానకరంగా తనని తీసివేసి తమన్‌ని పెట్టుకుని, ప్రస్తుతం బన్నీ చిత్రానికి కూడా అవకాశం ఇవ్వని త్రివిక్రమ్‌ని ఉద్దేశించే అని మరికొందరు అంటున్నారు. అయితే అనిరుధ్‌ ఒకే ట్వీట్‌తో ఇద్దరినీ టార్గెట్‌ చేసినట్లుగానే అనిపిస్తోందని చెప్పాలి. 



By April 23, 2019 at 05:13AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45636/satirical-video.html

No comments