Breaking News

ఈ టైటిల్స్‌లో త్రివిక్రమ్ ఏది ఫైనల్ చేస్తాడో?


త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన చిత్రాలలో కమర్షియల్‌ అంశాలు, హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసేలా సీన్స్‌ రాసుకుంటూనే అండర్‌ కరెంట్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే ఫ్యామిలీ ఎమోషన్స్‌కి కూడా పెద్ద పీట వేస్తాడు. ఆయన తీసిన ‘అత్తారింటికి దారేది’లో మేనత్త సెంటిమెంట్‌, ‘సన్నాఫ్‌సత్యమూర్తి’లో తండ్రి సెంటిమెంట్‌.. ఇలా చెప్పుకోవాలి. ఇక ఆమధ్య వచ్చిన ఎన్టీఆర్‌-సుకుమార్‌ చిత్రం ‘నాన్నకుప్రేమతో’ కూడా ఫాదర్‌ సెంటిమెంట్‌తో నిండిన చిత్రమే. 

కాగా ప్రస్తుతం గీతాఆర్ట్స్‌, హారిక అండ్‌ హాసిని భాగస్వామ్యంలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ నటించబోయే చిత్రం ఫాదర్‌ సెంటిమెంట్‌ ప్రధానంగా తయారు చేసుకున్నదా? లేక మదర్‌ సెంటిమెంట్‌ని టచ్‌ చేస్తూ రాసుకున్నదా? అనే విషయంలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ చిత్రం కోసం రెండు టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి ‘అలకనంద’ కాగా రెండోది ‘నేను నాన్న’. ఇక ఇందులో అల్లుఅర్జున్‌ తండ్రి పాత్రలకు ప్రముఖ మలయాళ నటుడు జయరాంని, తల్లి పాత్రకు టబును ఎంచుకున్నాడట. జయరాం అంటే ఎవరో కాదు.. అప్పుడెప్పుడో కమల్‌హాసన్‌ హీరోగా వచ్చిన ‘తెనాలి’ చిత్రంలో బుద్దిమాంద్యం కలిగిన కమల్‌కి ట్రీట్‌మెంట్‌ చేసే సైకియాట్రిస్ట్‌ పాత్రలో నటించిన డాక్టర్‌ పాత్రను చేసిన నటుడు. ఈ పాత్రకు ఆ చిత్రంలో స్వయంగా రాజేంద్రప్రసాద్‌ డబ్బింగ్‌ చెప్పాడు. 

ఇటీవల కాలంలో తెలుగులోకి మలయాళ కుట్టీలే కాదు.. మలయాళ స్టార్స్‌ కూడా వస్తున్నారు. మోహన్‌లాల్‌-మమ్ముట్టి-సురేష్‌గోపి నుంచి దుల్కర్‌సల్మాన్‌ వరకు వచ్చి అలరిస్తున్నారు. మరోవైపు హీరో తల్లి పాత్రకు ఏరికోరి ‘నిన్నేపెళ్లాడతా’లో పండుగా పేరు పొంది ఎన్నో అద్భుత చిత్రాలు, స్టార్స్‌తో నటించిన టబుని తీసుకోవడం గమనార్హం. మరి ఈ చిత్రంలో తల్లిదండ్రుల సెంటిమెంట్‌లో ఎవరిది పైచేయిగా త్రివిక్రమ్‌ రాసుకున్నాడు? అనే దానిపైనే ఈ చిత్రం టైటిల్‌ ఆధారపడి ఉంటుందని చెప్పాలి. 



By April 22, 2019 at 01:06PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45631/tabu.html

No comments