Breaking News

‘పలాస 1978’ షూటింగ్ పూర్తయింది


యదార్థగాధగా తెరకెక్కుతున్న ‘పలాస 1978’ షూటింగ్ పూర్తి.. మే లో సినిమా విడుదల..!!

అభ్యుదయ భావాలతో, ప్రేక్షకుడిని ఆలోచింప జేసే చిత్రాలు నిర్మించే తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో  లండన్ బాబులు ఫేమ్ రక్షిత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పలాస 1978’..  నక్షత్ర హీరోయిన్ గా యదార్థ గాథగా రాబోతున్న ఈ సినిమాని బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అట్లూరి వరప్రసాద్, అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు... పలు చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో పనిచేసిన కరుణ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.. రఘు కుంచె సంగీతాన్ని, విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు. ప్రముఖ గీత రచయితలు భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మి భూపాల్ లు ఈ సినిమాకి సాహిత్యం అందించడం విశేషం. కాగా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, షూటింగ్  పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘గతవారమే సినిమా షూటింగ్ పూర్తయ్యింది.. ఏప్రిల్ నెలాఖరులో టీజర్ రిలీజ్ చేసి, మే మొదటి వారంలో పాటలు, ట్రైలర్ ని రిలీజ్ చేస్తామన్నారు..  మే చివరి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు ప్రారంభించాం’’ అన్నారు..

నటీనటులు :  రక్షిత్, నక్షత్ర, రఘుకుంచె, జనార్దన్, మిర్చి మాధవి, కంచరపాలెం రాజు, మీసాల లక్ష్మణ్,  తదితరులు...

సాంకేతిక నిపుణులు : 

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కరుణ కుమార్

నిర్మాతలు: అట్లూరి వరప్రసాద్, అప్పారావు బెల్లన

కెమెరా: విన్సెంట్ అరుల్

సంగీతం: రఘు కుంచె

సాహిత్యం: భాస్కరభట్ల,సుద్దాల అశోక్ తేజ, లక్ష్మి భూపాల్

కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

ఫైట్స్: రామ్ సుంకర

పి.ఆర్.ఓ : సాయి సతీష్



By April 07, 2019 at 01:33PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45446/palasa-1978.html

No comments