‘డియర్ కామ్రేడ్’కి ఈ కాంపిటేషన్ తప్పదా?
టాలీవుడ్ లేటెస్ట్ సంచలనం, సెన్నేషనల్ స్టార్, రౌడీస్టార్, తెలంగాణ మెగాస్టార్ వంటి ఎన్నో బిరుదులు విజయ్ దేవరకొండకి ఉన్నాయి. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, మహానటి, గీతగోవిందం, ట్యాక్సీవాలా వంటి బ్లాక్‌బస్టర్స్‌ని అతి తక్కువ వ్యవధిలోనే ఈయన సాధించాడు. అతి తక్కువ వ్యవధిలో స్టార్‌గా ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవి సైతం విజయ్ దేవరకొండ అనే స్టార్ వచ్చాడని కితాబునిచ్చాడు. అల్లుఅరవింద్ అయితే విజయ్‌ని చూస్తుంటే కెరీర్ మొదట్లో చిరంజీవిని చూసినట్లే ఉందని కితాబునిచ్చాడు. ఇక ఈయన నటించిన అర్జున్‌రెడ్డి, గీతగోవిందం చిత్రాలు నేరుగా తమిళనాడు, కర్ణాటకలలో విడుదలై ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో అనుకోకుండా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ‘నోటా’లో నటించాడు. కానీ ఈ చిత్రం నిరాశపరిచింది.
ప్రస్తుతం ఆయన భరత్ కమ్మ అనే నూతన దర్శకునితో ‘డియర్ కామ్రేడ్’ చిత్రం చేస్తున్నాడు. మైత్రిమూవీ మేకర్స్ వంటి అభిరుచి ఉన్న సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. గీతగోవిందం తర్వాత మరోసారి విజయ్ రష్మికమందన్నతో కలిసి నటిస్తుండటం మరో విశేషం. కాగా ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం వంటి దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. మే 31వ తేదీని కూడా లాక్ చేసుకున్నారు. సోలో రిలీజ్ ఉంటుందని అందరు భావిస్తున్న తరుణంలో విజయ్‌కి అనుకోని విధంగా రెండు చిత్రాల నుంచి పోటీ ఏర్పడుతోంది. వారం రోజుల గ్యాప్‌లో సల్మాన్ నటించిన ‘భరత్’ విడుదలకానుంది. దీనివల్ల ‘డియర్ కామ్రేడ్’కి పెద్దగా దెబ్బ ఉండదని చెప్పాలి.
కానీ తమిళ స్టార్ హీరో సూర్య, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఎన్జీకే’ చిత్రాన్ని కూడా ఏకంగా అదే తేదీని ఫిక్స్ చేశారు. తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ స్టేటస్ ఉన్న హీరో సూర్య. ఈయన చిత్రం అంటే తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల అవుతుంది. ఇక కన్నడ, మలయాళ భాషల్లో కూడా సూర్య చిత్రాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇటీవల సూర్య కెరీర్ గాడి తప్పింది. కానీ ఆయన సినిమాకి హిట్ టాక్ వస్తే వసూళ్ల ప్రభంజనమే సృష్టిస్తుంది. ఇక ‘ఎన్జీకే’ చిత్రం ఎంతో ఆలస్యం తర్వాత మే31న రానుండటంతో దాని ఎఫెక్ట్ రౌడీస్టార్ విజయ్ ‘డియర్ కామ్రేడ్’పై పడటం ఖాయమనే చెప్పాలి.
By March 28, 2019 at 09:46AM
No comments