Breaking News

ఈసారి త్రివిక్రమ్ తీసుకొస్తున్న ఆంటీ ఈమేనా?


బాలీవుడ్‌ హీరోయిన్‌ అయిన టబుది వాస్తవానికి హైదరాబాదే. ఈమె తెలుగులో మొదటి చిత్రంగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌ నటించిన ‘కూలీనెంబర్‌1’ ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో ‘అందరివాడు’, బాలయ్యతో ‘చెన్నకేశవరెడ్డి’, నాగార్జునతో ‘నిన్నే పెళ్లాడతా’ వంటి అనేక చిత్రాలలో నటించి స్టార్‌ హీరోయన్‌గా తనకి తిరుగులేదని నిరూపించుకుంది. బాలకృష్ణతో ‘పాండురంగడు’ తర్వాత చంద్రసిద్దార్ధ్‌ దర్శకత్వంలో ఓ కంటెంట్‌ ఓరియంటెడ్‌ మూవీలో నటించింది. ఆ తర్వాత ఈమె బాలీవుడ్‌పైనే దృష్టిపెడుతూ వస్తోంది. సినిమాలలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే కాకుండా వెబ్‌సిరీస్‌లలో కూడా యాక్ట్‌ చేస్తోంది. గత ఏడాది ఆమె నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను చేసిన ‘అంధాదూన్‌’ చిత్రం ఈమెకి ఎంతో మంచి పేరు తీసుకుని వచ్చింది. 

ఇకపోతే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత హ్యాట్రిక్‌ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ మధ్య గ్యాప్‌లో ఆయన కాస్త బొద్దుగా తయారయ్యాడట. కానీ ఈ చిత్రంలో ఆయన స్లిమ్‌ లుక్‌లో కనిపించాల్సిన అవసరం ఉండటంతో ప్రస్తుతం ఆయన జిమ్‌, వ్యాయామాలు, స్ట్రిక్ట్‌డైట్‌ని ఫాలో అవుతున్నాడట. మొదటి నుంచి బన్నీ ఫిట్నెస్‌కి లుక్‌కి మంచి ఇంపార్టెన్స్‌ ఇచ్చే స్టార్‌. ప్రతి చిత్రంలోనూ మేకోవర్‌ పరంగా విభిన్నంగా కనిపించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక టాలీవుడ్‌లో ఈయన పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించిన ‘దేశముదురు’ ద్వారా సిక్స్‌ప్యాక్‌ బాడీని పరిచయం చేసిన విషయం తెలిసిందే. 

త్రివిక్రమ్‌ మూవీలో బన్నీ తల్లిపాత్రకి టబుని తీసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నాడని సమాచారం. నదియా, స్నేహ, ఖుష్బూ వంటి వారికి తన చిత్రాలలో ప్రాముఖ్యం ఉన్న పాత్రలు ఇచ్చిన త్రివిక్రమ్‌ మూవీకి టబు ఓకే చెబుతుందా? లేదా? అనేది వేచిచూడాలి. ఈ చిత్రంలో ఇప్పటికే తమిళనటుడు సత్యరాజ్‌, మలయాళ నటుడు జయరాం, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, సీనియర్‌ నరేష్‌లను కీలకపాత్రలకు ఎంపిక చేసుకున్నాడు. మొత్తానికి ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్‌ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయి. 



By March 23, 2019 at 08:31AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45255/actress-tabu.html

No comments