Breaking News

నభాకు కాదు.. రాశిఖన్నాకు ఆ ఛాన్స్..!


 

ప్రస్తుతం నభా నటేష్.. రవితేజ పక్కన ‘డిస్కో రాజా’ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక రెండు మూడు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయని చెబుతున్న నభా నటేష్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ యాంగిల్స్ తో ఫొటోస్ దిగుతూ పర్సనల్ పిఆర్ టీం ద్వారా మంచి పబ్లిసిటీ చేసుకుంటుంది. తాజాగా నభా నటేష్‌కి ఒక యంగ్ హీరో పక్కన ఛాన్స్ వచ్చిందని.. రకుల్ ప్రీత్ ప్లేస్‌లోకి నభా నటేష్ ని తీసుకుంటున్నారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరిగింది. అది కూడా వెంకీ మామ అనే మల్టీస్టారర్ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా కుర్ర హీరోయిన్ నభా నటేష్‌ని తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. ఇక రకుల్ లక్కుని కొట్టేసింది నభా అంటూ వార్తలు అప్పుడే వచ్చేశాయి కూడా.

కానీ తాజాగా నభా నటేష్‌కి అంత సీన్ లేదని.. ఆమెని కాదని మరో హీరోయిన్‌కి నాగ చైతన్య ఓటేసాడనే టాక్ మొదలైంది. వెంకీ మామ సినిమాలో నాగ చైతన్యకి జోడిగా మొదట్లో రకుల్ ప్రీత్ ని ఎంపిక చెయ్యగా.. ఆమె తప్పుకోవడంతో.. నభా పేరుని పరిశీలించగా.. చైతు మాత్రం తొలిప్రేమతో మళ్ళీ లైం టైంలోకొచ్చిన రాశి ఖన్నా కి ఓటేసాడట. 

అయితే రాశి ఖన్నా కి తొలిప్రేమ హిట్ ఉన్నప్పటికీ... నితిన్ తో కలిసి చేసిన శ్రీనివాస కళ్యాణం ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ.. నాగ చైతన్య, రాశి ఖన్నా అయితే బావుంటుందని దర్శకుడు బాబీ కి నిర్మాత, మేనమామ అయిన సురేష్ బాబు కి చెప్పగా.. ప్రస్తుతం సురేష్ బాబు రాశి ఖన్నాతో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. మరి నభా నటేష్‌కి అలా అదృష్టం తలుపు తట్టినట్లే తట్టి మాయమైంది.



By February 23, 2019 at 05:18AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44834/raashi-khanna.html

No comments