Breaking News

అప్పుడు నాగ్.. ఇప్పుడు రామ్‌చరణ్


సినిమా జయాపజయాలు ఎవరి చేతుల్లో ఉండవు. కష్టపడటం, ఆత్మవిమర్శ తప్ప దీనికి మరో మార్గం లేదు. అందరు సక్సెస్‌ కావాలనే కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. కానీ కొన్ని సార్లు ఏ చిత్రం ఎందుకు ఆడింది? ఏ చిత్రం ఎందుకు ఆడలేదు? అనేది చెప్పడం కూడా కష్టం. దీనికి ఉదాహరణగా ‘కథానాయకుడు’ని తీసుకుంటే ఈ చిత్రం మంచి పాజిటివ్‌ టాక్‌, రివ్యూలు సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఇక బోయపాటి శ్రీను, రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ది మరో పరిస్థితి. డిజాస్టర్‌టాక్‌నే కాదు.. అభిమానులు కూడా పెదవి విరిచేలా నేల విడిచి సాము చేసిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించిన పరాజయం తప్పలేదు. 

అదే బోయపాటి శ్రీనునే, అల్లుఅర్జున్‌తో తీసిన ‘సరైనోడు’ విషయానికి వస్తే ఇది కూడా మొదట్లో దారుణమైన టాక్‌ తెచ్చుకుంది. కానీ ఏమి చిత్రమో గానీ ఇది లాంగ్‌ రన్‌లో మంచి కమర్షియల్‌ హిట్‌ని నమోదు చేసుకుంది. ఇక స్టార్స్‌కి జయాపజయలు సహజం. ఫ్లాప్‌ వచ్చినప్పుడు తిట్టిన వారే ఆ తర్వాత నెత్తిన పెట్టుకుంటారు. దీనికి తాజా ఉదాహరణలుగా జూనియర్‌ ఎన్టీఆర్‌, నానిల కెరీర్లను చెప్పవచ్చు. ఇక సినిమా బాగా లేకపోయినా ‘డిజె, నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాల విషయంలో దర్శకనిర్మాతలు, అల్లుఅర్జున్‌ తమ తప్పును ఒప్పుకోలేకపోయారు. 

ఈ విషయంలో నాగార్జునని అందరు ఆదర్శకంగా తీసుకోవాలి. ఆయన నటించిన ‘భాయ్‌’ చిత్రం ఇంకా థియేటర్లలో ఉన్నప్పుడే నాగార్జున ఆ చిత్రం చూడవద్దని చెప్పాడు. కానీ రామ్‌చరణ్‌ మరీ అంతగా డేరింగ్‌ డెసిషన్‌ తీసుకోకపోయిన ఎంతో కొంత ఫర్వాలేదనిపించాడు. సినిమా విడుదలైన వెంటనే చూడవద్దని, ఫ్లాప్‌ అని ఒప్పుకుంటే కోట్లతో సినిమా నిర్మించిన నిర్మాతలు, బయ్యర్లు కూడా నష్టపోతారు. కాబట్టే ఆయన ‘వినయ విధేయ రామ’ ఫైనల్‌ రన్‌ పూర్తయిన సందర్భంగా ఈ చిత్రం బాగా ఆడలేదనే విషయాన్ని ఒప్పుకోవడం హర్షణీయం. 



By February 08, 2019 at 04:01AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44615/ram-charan.html

No comments