లీగల్ చిక్కుల్లో ప్రకాష్‌రాజ్!
సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ పలు రాజకీయ పార్టీలపై పంచ్లు వేసే నటుడు ప్రకాష్‌రాజ్ కే పంచ్ పడింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్న ప్రకాష్‌రాజ్ లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. అయితే అది రాజకీయ ఎంట్రీకి సంబంధించి కాదు. ఓ సినిమా విషయమై. ఆ మధ్య మలయాళంలో విజయాన్ని సాధించిన `సాల్ట్ అండ్ పెప్పర్` చిత్రాన్ని తెలుగులో `ఉలవచారు బిర్యానీ` పేరుతో న్రకాష్‌రాజ్ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన విషయం తెలిసిందే.
ఇదే చిత్రాన్ని హిందీలో `తడ్కా` పేరుతో ప్రకాష్‌రాజ్ రీమేక్ చేస్తున్నారు. ఈ బాలీవుడ్ రీమేక్‌లో నానా పటేకర్, శ్రియ, అలీ ఫైజల్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ తో కలిసి ప్రకాష్‌రాజ్ బంధువు జితేష్ వర్మ మరో వ్యక్తి సమీర్ దీక్షిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2017లో విడుదల కావాల్సిన ఈ సినిమా లీగల్ రైట్స్ విషయంలో ప్రకాష్‌రాజ్, జీ స్టూడియోస్ మధ్య వివాదం తలెత్తడంతో ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ వివాదంపై ముబై హైకోర్టును ఆశ్రయించిన జీ స్టూడియోస్ ప్రకాష్‌రాజ్‌కు బాంబే హైకోర్టు ద్వారా లీగ్ నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు ప్రకాష్‌రాజ్ బంధువు జితేష్‌వర్మ ఓ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇదే జీ స్టూడియోస్‌కు, ప్రకాష్‌రాజ్‌కు మధ్య వివాదాన్ని సృష్టించిందని చెబుతున్నారు.
ఒప్పందం ప్రకారం ఈ సినిమా లాభాల కింద జీ స్టూడియోకి 60 శాతం, మిగతా 40 శాతం జితేష్ వర్మ అండ్ సమీర్ దీక్షిత్‌లకు చెందుతుంది. ఇందులో ఈ సినిమా రీమేక్ హక్కులు పొందిన అసలు హక్కుదారుడైన ప్రకాష్‌రాజ్‌కు వాటానే లేదు. ఇదే వివాదానికి కారణంగా తెలుస్తోంది. 2017లో విడుదల కావాల్సి `తడ్కా` తాజా వివాదం కారణంగా మళ్లీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వివాదం పరిష్కారమై ఈ ఏడాదైనా విడుదలవుతుందో.
By February 07, 2019 at 06:14AM
No comments