Breaking News

అంత ఇగో ఎందుకు బోయపాటి?


బోయపాటికి ఈగో చాలా ఎక్కువ. అంతేకాదు.. రెమ్యూనరేషన్‌ విషయంలో కూడా కఠినంగా ఉంటాడు. ఇక ఆయన ‘సరైనోడు’ చిత్రం సమయంలో ఇది ‘నాన్‌-బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టినట్లు ప్రమోషన్స్‌ చేయాలని అల్లుఅరవింద్‌ని గట్టిగా పట్టుబట్టాడని, కానీ ‘ఖైదీనెంబర్‌ 150’ కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్లుగా ప్రచారం చేయడం సరికాదనే ఉద్దేశ్యంతో అల్లుఅరవింద్‌ కాస్త ఇబ్బందిపడ్డాడు. ఇక ‘జయజానకి నాయకా’ చిత్రాన్ని ‘నేనే రాజు నేనే మంత్రి, లై’ చిత్రాలతో కలిపి ఒకే రోజు విడుదల చేశాడు. పోటీ ఎందుకు అని ప్రశ్నిస్తే నా అభిమానులకు, ప్రేక్షకులకు నేనేంటో తెలుసు. నాకంటూ సొంత మార్కెట్‌ ఉంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. నా చిత్రం 40 నుంచి 50కోట్లు సాధిస్తుంది. అది కూడా నన్ను చూసి మాత్రమే అని సమాధానం ఇచ్చాడు. 

ఇక విషయానికి వస్తే తాజాగా ఆయన దానయ్య నిర్మాతగా, రామ్‌చరణ్‌ హీరోగా ‘వినయ విధేయ రామ’ తీశాడు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఏకంగా 90కోట్లకు పైగా బిజినెస్‌ జరుపుకుంది. అయితే డిజాస్టర్‌ టాక్‌ వచ్చినా 60కోట్ల వరకు రాబట్టింది. అయినా బయ్యర్లకు ఇది 30కోట్ల నష్టాన్ని మిగిల్చింది. దీనిపై తాజాగా రామ్‌చరణ్‌ స్పందిస్తూ, పొరపాటు జరిగిందని, ఇకపై ఇలాంటి తప్పులు జరుగకుండా చూసుకుంటానని లెటర్‌ రాశాడు. నిజానికి ఈ చిత్రం విషయంలో చరణ్‌, దానయ్యల కంటే బోయపాటి శ్రీను తప్పిదమే ఎక్కువగా కనిపిస్తోంది. పూర్తి స్క్రిప్ట్‌ని తయారు చేయకుండా కేవలం ఓ లైన్‌ని వినిపించి, సెట్స్‌లో తనకి నచ్చిన సీన్స్‌ని అప్పటికప్పుడు ఊహించుకుని చిత్రం తీశాడు. 

అంతేకాదు. ఏమాత్రం ముందు జాగ్రత్త లేకుండా తన చిత్రం షూటింగ్‌ సమయంలో ఎవరిపై సీన్స్‌ తీస్తుంటే వారు మాత్రమే కాదు.. నటీనటులందరు సెట్స్‌లోనే ఉండాలని, తనకి అప్పటికప్పుడు ఏ సీన్‌ తీయాలనిపిస్తే అదే తీస్తాననేది ఆయన స్టైల్‌ అంటూ వార్తలు వచ్చాయి. ఇలా చూసుకుంటే ఈయన మరో కృష్ణవంశీ అని చెప్పాలి. ‘వినయ విధేయ రామ’ చిత్రం 30కోట్ల నష్టాలను భరించడంతో రామ్‌చరణ్‌ తన రెమ్యూనరేషన్‌లో నుంచి ఐదు కోట్లు, నిర్మాత దానయ్య మరో ఐదు కోట్లు బయ్యర్లకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కనీసం నష్టాలొచ్చిన 30 కోట్లలో కనీసం సగం అంటే 15కోట్లయినా తిరిగి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో దానయ్య, బోయపాటి శ్రీనుని కూడా ఓ ఐదు కోట్లు ఆయన పారితోషికం ఇవ్వాలని కోరాడట. 

కానీ కేవలం రెమ్యూనరేషన్‌ తీసుకుని సినిమా తీసిన నేను ఐదు కోట్లు ఎందుకివ్వాలి? కేవలం నా ఒక్కడి వల్లనే సినిమా ఫ్లాప్‌ అయిందన్నట్లుగా వ్యవహరిస్తే తాను పదిపైసలు కూడా ఇవ్వనని ఇగో హర్ట్‌ అయిన బోయపాటి వాదించాడని, దాంతో దిల్‌రాజు, ఎన్వీ ప్రసాద్‌లు రంగంలోకి దిగి వివాదాన్ని సెటిల్‌ చేస్తున్నారని సమాచారం. అయినా ఏ సంబంధం లేని చరణ్‌ కూడా నష్టాలను పూడ్చడానికి ముందుకు వచ్చిన సమయంలో మరీ ఇంతలా బోయపాటి ఇగో ప్రదర్శించడం సరికాదనే చెప్పాలి. 



By February 09, 2019 at 01:53PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44644/boyapati-srinu.html

No comments