Breaking News

కేథరిన్ కొట్టిందయ్యా.. ఛాన్స్!


విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ సినిమాలో కేథరిన్ తెరిస్సా..

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఫీల్ గుడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రారంభం కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. 

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా కథానాయికలుగా నటిస్తుండగా మరో హీరోయిన్ గా కేథరిన్ తెరిస్సా ఎంపికైంది..

గోపిసుందర్ సంగీతం సమకూరుస్తుండగా, జే కే సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పతాకంపై కెఏ వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు..

నటీనటులు : విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా, కేథరీన్ తెరిస్సా తదితరులు

సాంకేతిక నిపుణులు : 

రచయిత & దర్శకుడు : క్రాంతి మాధవ్ 

సమర్పణ : కేఎస్ రామా రావు 

నిర్మాత: కె.ఎ. వల్లభ 

బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్

సంగీతం: గోపి సుందర్ 

డిఓపి : జే కే 

ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్ 

PRO: వంశీ-శేఖర్



By February 04, 2019 at 05:08AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44560/catherine-tresa.html

No comments