Breaking News

ఓ గొప్ప దర్శకుడ్ని ఇలానేనా అవమానించేది?


కొందరు దర్శక నిర్మాతలు, హీరోలు రీమేక్‌లంటే బాగా ఇష్టపడతారు. కారణం ఏమిటంటే.. ఆల్‌రెడీ ప్రూవ్‌ అయిన స్టోరీ, మూవీ కాబట్టి. కానీ పరభాషా చిత్రాల రీమేక్‌లు అంత సులభం కాదు. వేరే భాషల్లో హిట్‌ అయిన చిత్రానికి తగిన నటీనటులు, దర్శకులు, కథలో నేటివిటీకి అనుగుణంగా చేయాల్సిన మార్పులు చేర్పులు వంటి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అందునా సోషల్‌మీడియా బాగా విస్తరించిన తర్వాత ఇతర భాషల్లో వచ్చిన ఓరిజినల్‌ వెర్షన్‌ని సినీ ప్రేమికులు ముందుగానే చూసేస్తున్నారు. దాంతో రెండింటి మధ్య పోలికలు, నటన, దర్శకత్వం విషయంలో కంపారిజన్స్‌ ఖచ్చితంగా వస్తాయి. అంతేకాదు.. ఇతర భాషల్లో బ్లాక్‌బస్టర్స్‌ అయిన చిత్రాల రీమేక్‌లపై భారీ అంచనాలు ఏర్పడతాయి. 

ఇక ‘3 ఇడియట్స్‌’ని ‘స్నేహితుడు’, మెగాస్టార్‌ చిరంజీవి ‘స్నేహంకోసం, శంకర్‌ దాదా జిందాబాద్‌’, ప్రభాష్‌ ‘యోగి’ వంటి చిత్రాలన్నింటిలో ఒరిజినల్‌ వెర్షన్‌లోని మూలాన్ని మిస్‌ చేసుకుని ఆత్మలేని శరీరంగా మారిపోయాయి. ఇక క్రియేటివ్‌ దర్శకుల విషయంలో ఇది మరింత ప్రమాదం. శేఖర్‌ కమ్ముల ‘కహాని’ రీమేక్‌ ‘అనామిక’, క్రిష్‌ ‘ఠాగూర్‌, రమణ’ల రీమేక్‌ ‘గబ్బర్‌’ ఇవే కోవకి చెందుతాయి. 

తాజాగా దేశం గర్వించదగ్గ దర్శకుడు, అవార్డుల డైరెక్టర్‌ ‘శివపుత్రుడు, నేనే దేవుణ్ణి, వాడు-వీడు’ వంటి బోల్డ్‌ చిత్రాలను తీసిన బాల ప్రస్తుతం తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌ ‘వర్మ’ని తీస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా చియాన్‌ విక్రమ్‌ కుమారుడు దృవ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడులైన పోస్టర్స్‌, టీజర్స్‌పై విమర్శలు వచ్చాయి. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ స్థాయిలో లేదని ట్రోలింగ్‌ జరిగింది. 

తాజాగా ఈ చిత్రం మొత్తం చూసిన నిర్మాతలు బాలాపై ఆగ్రహం వ్యక్తం చేసి మరో దర్శకునితో ఈ చిత్రం మొత్తాన్ని మరలా షూట్‌ చేయాలని నిర్ణయించారట. ఇది నిజంగా బాలాకి అవమానమే. ఓ పెద్ద దర్శకుడు తీసిన చిత్రాన్ని పూర్తిగా పక్కనపెట్టి మరలా మరో దర్శకునితో తీయడం అనేది చాలా అరుదుగా జరిగే విషయమేనని చెప్పాలి. 



By February 09, 2019 at 02:59PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44649/arjun-reddy.html

No comments