చిరంజీవి సంతోషానికి కారణం..!!
చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. చిరు తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో చిరంజీవి ఇప్పటిదాకా ఇలాంటి సినిమా చేయలేదనే చెప్పాలి. ఆయనకు ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి కానీ ఇటువంటి సినిమా ఎప్పుడూ చేయలేదు.
చిరు రీఎంట్రీతో ఇటువంటి సినిమా చేస్తున్నాడు అంటే మాములు విషయం కాదు. ఈ వయసులో ఇటువంటి చిత్రం అంటే మెచ్చుకోవాల్సిన విషయమే. ఇది ఇలా ఉంటే అసలు ‘సైరా’ లాంటి భారీ చిత్రం చేయడానికి పునాది పుష్కరం కిందటే పడిందని అంటున్నాడు చిరు. తన కొడుకు చరణ్ వల్లే దీనికి పునాది పడిందని చెబుతున్నారు.
రాజమౌళితో చరణ్ రెండవ సినిమాగా ‘మగధీర’ ఎంత విజయం సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. ఆ చిత్రం షూటింగ్ జరుగుతున్న టైములో చరణ్ తో... ‘‘రెండో సినిమాకే నువ్వు ఇలాంటి కాస్ట్యూమ్ పీరియడ్ డ్రామా చేస్తున్నావు... నువ్వు చాలా అదృష్టవంతుడివి.. నేను 149 సినిమాలు చేసిన ఇటువంటి సినిమా చేసే అవకాశం రాలేదు’’ అని చిరు చెప్పాడట.
ఈ మాటలు చరణ్ గుర్తు పెట్టుకుని నాకు ‘సైరా నరసింహారెడ్డి’ ప్రాజెక్టును సెట్ చేశాడని చిరు అన్నారు. దీంతో చిరుకి ఇలాంటి పీరియడ్ డ్రామా చేయాలనే కోరిక తీరిపోయిందని చెప్పాడు. ఇది చరణ్ తనకు ఇచ్చిన గిఫ్ట్ అని చిరు అన్నారు.
By February 21, 2019 at 04:03AM
No comments