Breaking News

నాదెండ్ల విషయంలో ఏం జరుగుతోంది...?


సాధారణంగా స్టార్స్‌ చిత్రాలలో హీరోతో పాటు విలన్‌ కూడా ఉంటారు. అలా ఉండి ఎత్తుకు పైఎత్తులు వేసే విధంగా, అరివీరభయంకర యాక్షన్‌ సీన్స్‌ ఉంటేనే బాలయ్య వంటి మాస్‌ చిత్రాలు జనాలను మెప్పిస్తాయి. కానీ ‘కథానాయకుడు’లో విలన్‌ అవసరమే రాలేదు. కానీ ‘మహానాయకుడు’ ట్రైలర్‌ని చూస్తుంటే ఇందులో ఎన్టీఆర్‌ని గద్దెదించి ఇందిరాగాంధీ, రామ్‌లాల్‌ మద్దతుతో పదవి ఎక్కిన నాదెండ్ల భాస్కర్‌రావుని విలన్‌గా చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ పైలెట్‌ అయితే నేను కో పైలెట్‌, అడ్మినిస్ట్రేషన్‌ ఆయనకు తెలియకపోతే నేనే చూసుకుంటాను వంటి సీన్స్‌, ఎన్టీఆర్‌ పాత్రధారి అయిన బాలయ్య నాదెండ్ల వైపు సీరియస్‌గా చూడటం వంటివి గమనిస్తే ‘మహానాయకుడు’లో నాదెండ్ల క్యారెక్టర్‌ని నెగటివ్‌గా చూపించడం ఖాయమని అర్ధమవుతోంది. కానీ చంద్రబాబు పాత్రధారి అయిన దగ్గుబాటి రానాని మాత్రం ఎన్టీఆర్‌ కీర్తిని దేశవ్యాప్తం చేసిన నాయకునిగా చూపించనున్నారనే ప్రచారం సాగుతోంది. 

తాజాగా దీనిపై కమెడియన్‌, వైసీపీ నాయకుడు పృథ్వీ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ కంటే రాంగోపాల్‌వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కోసమే ప్రజలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. జనాలు నిజంగా జరిగిన చరిత్రను తెలుసుకోవాలని భావిస్తున్నారు. వాస్తవాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ దమ్ము ధైర్యం వర్మకే ఉన్నాయని నమ్ముతున్నారు. ఒకవేళ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే నారా చంద్రబాబునాయుడుని విలన్‌గా చూపించాలి. అలా బాలకృష్ణ చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు బాలయ్యకు బావే కాదు.. వియ్యంకుడు కూడా. కాబట్టి బాలయ్య ఆ పని చేయలేరు అని పృథ్వీ వ్యాఖ్యానించాడు. 

లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎంటర్‌ అయిన తర్వాత కుటుంబ సభ్యులే కాదు.. ఎన్టీఆర్‌ చుట్టూ ఉన్న వారు కూడా ఆయనకి అన్యాయం చేశారు. వర్మకి ఎవరిపై కక్ష్య లేదు. ఆయన జరిగింది జరిగినట్లుగా చూపించాలని మాత్రమే భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో చంద్రబాబు పాత్రను దగ్గుబాటి రానా చేత చేయిస్తూ రాముడు మంచి బాలుడు అనేలా చూపిస్తున్నారని పృథ్వీ ఎద్దేవా చేశాడు. 

ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌లోని మొదటి భాగం ‘కథానాయకుడు’ విడుదల సమయంలోనే తనని విలన్‌గా చూపిస్తే ఊరుకునేది లేదని, అందరి బండారాలు బయటపెట్టి మరీ చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నాదెండ్ల హెచ్చరించాడు. మరి ‘మహానాయకుడు’లో నాదెండ్ల పాత్రను నెగటివ్‌గా చూపించనున్నారని తేలిన సమయంలో నాదెండ్ల ఎలా స్పందిస్తారు? అనేది వేచిచూడాల్సివుంది. 



By February 19, 2019 at 12:59PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44789/balakrishna.html

No comments