హైపర్ ఆదికి అంత సీన్ లేదని ఒప్పుకున్నాడు
త్రివిక్రమ్ మాటల రచయితగా.. ఎంత మంచి పేరుందో తెలిసిందే. ఆయన చాలామంది దర్శకులకు కథ, మాటలు అందించాడు. అలాగే మాటల రచయిత నుండి దర్శకుడిగా సినిమాలు చేస్తూ హిట్ డైరెక్టర్ గాను పేరు తెచ్చుకున్నాడు. అలాంటి మాటల మాంత్రికుడు తన సినిమాలకు వేరే మాటల రచయితని తీసుకుంటాడా? అదేమోగాని.. జబర్దస్త్ ద్వారా బాగా పాపులరై.... సినిమాలకు కథలు రాసే స్థాయికి ఎదిగిన హైపర్ ఆది, త్రివిక్రమ్ సినిమాలకు మాటల రచయితగా పనిచెయ్యబోతున్నాడని, త్రివిక్రమే స్వయంగా పిలిచి ఆదిని అడిగినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జబర్దస్త్ లో అద్భుతమైన పంచ్ డైలాగ్స్ తో హైపర్ ఆది దూసూకుపోతున్నాడు. హైపర్ ఆది స్కిట్ కి బోలెడుమంది అభిమానులున్నారు. ఇక ఆది జబర్దస్త్ లో ఫేమ్ వచ్చాక రెండు మూడు సినిమాలకు కథ, మాటలు అందించడమే కాదు.. నటుడుగా సినిమాల్లోనూ హీరోల ఫ్రెండ్స్ కేరెక్టర్స్ చేస్తున్నాడు. అలాంటి ఆదిని త్రివిక్రమ్ పిలిచి తన సినిమాలకు మాటలు రాయమన్నాడంటున్నారు. అయితే త్రివిక్రమ్ బాగా బిజీగా ఉండటం వల్లన, అలాగే ఆది మాటలకి ఆసక్తి చూపిన త్రివిక్రమ్ నిజంగానే ఆదికి ఛాన్స్ ఇస్తూ ఉండొచ్చనే టాక్ వినిపించింది. తాజాగా త్రివిక్రమ్ సినిమాలకు ఆది రైటర్ అన్న మేటర్ చూసిన ఆది దానిపై స్పందించాడు.
నేను జబర్దస్త్ లో వేసే పంచ్ డైలాగ్స్ చూసి చాలామంది నన్ను త్రివిక్రమ్ లాంటి గ్రేట్ దర్శకుడితో పోల్చారు... అలాగే తాజాగా త్రివిక్రమ్ గారు నాకు మాటల రచయితగా అవకాశం ఇవ్వడానికి గాను.. నన్నుపిలిచినట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయినా త్రివిక్రమ్ లాంటి దర్శకుడు నన్ను పిలవడం ఏమిటండి.. అదంతా వట్టి ట్రాష్... నేను రెండు మూడుసార్లు త్రివిక్రమ్ గారిని కలిసాను. అది కూడా ఆయన మీదున్న అభిమానంతోనే. అంతే కానీ.. ఆయన తన సినిమాకి మాటలు రాయమని ఆయన నన్నెప్పుడూ అడగలేదు. అసలు త్రివిక్రమ్ గారికి ఆ అవసరం లేదు కూడా. తన సినిమాలకి తనే కథ .. మాటలు రాసుకునే సమర్థత ఆయన సొంతం. కాకపోతే నన్ను త్రివిక్రమ్ గారితో పోల్చడం మాత్రం నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది.. అంటూ ఆ రూమర్ పై ఆది స్పందించాడు.
By February 21, 2019 at 09:00AM
No comments