Breaking News

2 సినిమాల్లోనూ రకుల్‌ని తప్పించారు


ప్రస్తుతం హీరోయిన్ రకుల్ ప్రీత్ పరిస్థితి తెలుగు, తమిళంలోనూ ఒకే విధంగా వుంది. అస్సలు హిట్స్ లేని రకుల్ ప్రీత్ క్రేజ్ తెలుగులో తగ్గుమొహం పట్టింది. కానీ తమిళంలో మాత్రం పర్వాలేదనిపిస్తుంటే.. నిన్నగాక మొన్న విడుదలైన దేవ్ సినిమాతో ఉన్న క్రేజ్ కాస్త గోవిందా అయ్యింది. తాజాగా రకుల్ ప్రీత్‌కి యంగ్ హీరోలు వరస బెట్టి షాకులివ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మరింది. ఆ హీరోలెవరంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ తనకి పెద్దగా క్రేజ్ లేకపోవడంతో.. టాప్ హీరోయిన్స్‌ని తన సినిమాల్లో బుక్ చేసి తన సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ కలిగిస్తుంటాడు. అందుకే టాప్ హీరోయిన్స్‌ని కోట్లు కుమ్మరించి మరీ తన సినిమాల్లోకి ఎంపిక చేసుకుంటాడు.

అలాగే రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ ఉన్నప్పుడు కోటిన్నర పైనే రకుల్‌కి ముట్టజెప్పి మరీ ఆమెని తన జయ జానకి నాయక సినిమాకి తీసుకున్నాడు. తాజాగా మరోసారి బెల్లంకొండ రకుల్‌తో జోడి కట్టబోతున్నాడనే న్యూస్ బాగానే హైలెట్ అయ్యింది. బెల్లంకొండ  రైటర్ అండ్ డైరెక్టర్ రమేష్ వర్మతో చెయ్యబోయే తమిళ రాక్షసన్ రీమేక్‌లో రకుల్ ప్రీత్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుండగా.... ప్రస్తుతం క్రేజ్ కోల్పోయిన రకుల్ మళ్లీ బెల్లంకొండ సినిమాకి కోటిన్నర డిమాండ్ చెయ్యగా... అసలే క్రేజ్‌లో లేని హీరోయిన్ మనకెందుకులే అని.. రకుల్ ప్లేస్‌లోకి బాబ్లీ గర్ల్ రాశిఖన్నాని ఎంపిక చేసుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. మరి రకుల్‌ని కేవలం పారితోషకం ఎక్కువని తప్పించారో.. లేదంటే క్రేజ్ లేదనుకున్నారో.... కానీ రకుల్‌కి ఇది పెద్ద షాకే.

తాజాగా మరో యంగ్ హీరో నాగ చైతన్య కూడా రకుల్‌కి షాకిచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేని రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో రారండోయ్ వేడుక చూద్దాంతో హిట్ ఇచ్చిన నాగ చైతన్యతో వెంకీమామ అనే మల్టిస్టారర్‌లో హీరోయిన్‌గా ఎంపికైంది. మరి రకుల్ ప్రీత్ చేతిలో ఉన్న ఏకైన చిత్రం వెంకీమామ కాగా.. తాజాగా ఆ అవకాశం కూడా రకుల్ చేజారిందని... రకుల్ ప్లేస్ లోకి నన్ను దోచుకుందువటే ఫేమ్.. నభా నటేష్‌ని తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా టాక్. నభా నటేష్‌ని చైతుకి హీరోయిన్‌గా దర్శకుడు బాబీ, నిర్మాత సురేష్ ఫైనల్ చేసారని.. రకుల్‌కి క్రేజ్ లేకపోవడంతోనే ఆమెని తప్పించినట్లుగా చెబుతున్నారు. మరి ఇలా వరసగా రకుల్‌కి యంగ్ హీరోస్ షాకుల మీద షాకులిస్తుంటే.. ఇక తెలుగులో రకుల్ కనబడదేమో అనే డౌట్ మాత్రం వచ్చేస్తుంది.



By February 22, 2019 at 09:06AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44825/rakul-preet-singh.html

No comments