హైపర్ ఆది అక్కడ హిట్.. ఇక్కడ ఫట్!
బుల్లితెర మీద జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా చాలామంది కమెడియన్స్ వెండితెర మీద వెలిగిపోతున్నారు. ఈటివిలో ప్రసారం అయ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారా చాలామంది కమెడియన్స్ బాగా పాపులర్ అయ్యారు. అటు ఆస్తులు, ఇటు ఛాన్స్ లతో వారు ఒక వెలుగు వెలుగుతున్నారు. సుడిగాలి సుధీర్, చంటి, శ్రీను వంటి వాళ్ళు బుల్లితెర మీద అనేక రకాల షోస్ తో పాపులర్ అయ్యారు. ఇక చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు వెండితెర మీద కామెడీ చేస్తున్నారు. ఇక హైపర్ ఆది వంటి వాళ్ళు జబర్దస్త్ లో స్క్రిప్ట్ రైటర్స్ గాను, స్టేజ్ మీద కమెడియన్ గానే కాదు.. వెండితెర మీద కూడా కామెడీ చేస్తూ తమ సత్తా చాటుతున్నారు.
జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ అంటే పడి చచ్చే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. స్కిట్ లో అదరగొట్టే పంచ్ లతో ప్రేక్షకులను పడెయ్యడం.. కాస్త డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో షేక్ చెయ్యడంతో ఆది జబర్దస్త్ స్టేజ్ మీద బాగా పాపులర్ అయ్యాడు. కానీ వెండితెర మీద మాత్రం అంతగా పేరు తెచ్చుకున్నట్లుగా అనిపించడం లేదు. ఎందుకంటే అల్లరి నరేష్ తో మేడ మీద అబ్బాయి సినిమాకి కథ అందించిన ఆది ఆ సినిమాలో నరేష్ ఫ్రెండ్ గా, కమెడియన్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అలాగే తొలిప్రేమ సినిమాలో యుఎస్ లో వరుణ్ రూమ్మేట్ గా ఆది పంచ్ లు పెద్దగా పేలలేదు.
ఇకపోతే తాజాగా హైపర్ ఆది నటించిన మిస్టర్ మజ్ను కూడా ప్లాప్ అవడం.. అందులో హైపర్ ఆది కామెడిని ప్రేక్షకులు పెద్దగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇక గత రెండు నెలలుగా జబర్దస్త్ కి దూరమైన హైపర్ ఆది మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ మీద రీఎంట్రీ ఇవ్వడం... మళ్ళీ స్కిట్ ని అదరగొట్టెయ్యడంతో.. హైపర్ ఆది.. బుల్లితెర మీదే కానీ.. వెండితెర మీద తుస్సే అంటున్నారు. ఇక మరోపక్క ఆది పవన్ కళ్యాణ్ జనసేన కోసం రాజకీయాల్లోనూ కాస్త బిజీగా కనబడుతున్నాడు.
By January 31, 2019 at 08:25AM
No comments