Breaking News

అప్పుడు ఆటోడ్రైవర్‌‌.. ఇప్పుడు హాస్టల్ వార్డెన్


హాలీవుడ్‌తో పోలిస్తే మన దేశ చిత్ర పరిశ్రమల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ యంగ్‌హీరోయిన్ల కంటే బాగా వయసు ఉన్న, పెళ్లై పిల్లలు ఉన్న నటీమణులకు నటనలో మెచ్యురిటీ రీత్యా బాగా డిమాండ్‌ ఉంటుంది. ఇక హాలీవుడ్‌ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు ఏ వయసులో ఉన్నా కూడా పర్‌ఫెక్ట్‌ బాడీ బిల్డింగ్‌తో డూప్‌లకు ఆస్కారం లేకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడు ఈ ట్రెండ్‌ బాలీవుడ్‌కి కూడా వస్తోంది. అక్కడ వయసు మళ్లిన హీరోలకు, హీరోయిన్లకు కూడా బాగా డిమాండ్‌ పెరుగుతోంది. 

ఇక దక్షిణాదిలో స్టార్స్‌ అయిన రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, అజిత్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి సీనియర్‌ స్టార్స్‌ వయసు ఎంత పెరిగినా విగ్గులతో మెయిన్‌టెయిన్‌ చేస్తూ మనవరాళ్ల వయసున్న హీరోయిన్లతో ‘అమ్మడు... లెట్స్‌ డు కుమ్ముడు’ అంటుంటారు. ఈ విషయంలో కాస్త రజనీకాంత్‌, నాగార్జున, వెంకటేష్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి వారు మాత్రమే మినహాయింపు. వీరిలో కొందరికి చాలా ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. రజనీతో పాటు నాగార్జున, వెంకటేష్‌ వంటి వారు కూడా ఛాలెంజింగ్‌ పాత్రలు, వయసుకు తగ్గ పాత్రలు చేస్తామని చెబుతూ ఉన్నారు. 

కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం విజయశాంతి, నయనతార, అనుష్క వంటి ఒకటి అరా మినహా పాతిక, ముప్పై వయసు వస్తే ఫేడవుట్‌ అవుతూ ఉంటారు. అయినా కొందరి సీనియర్‌స్టార్స్‌లో వచ్చిన మార్పు ప్రేక్షకులలో, వారి అభిమానులలో రావడం లేదనేది వాస్తవం. ఎందుకంటే రజనీ ఈ మద్య తన వయసుకు తగ్గట్టుగా ‘కబాలి, కాలా’ వంటి చిత్రాలు చేస్తూ కాస్త వయసు పైబడిన హీరోయిన్లు, పాత్రలు చేస్తుంటే జనాలు బోర్‌గా ఫీలవుతున్నారు. ప్రేక్షకులు ఇంకా రజనీని 25ఏళ్ల కుర్రాడిలా చూడాలని భావిస్తుండటం కూడా దీనికి ఓ కారణంగా చెప్పాలి. కానీ రజనీ మాత్రం తన ముందు చిత్రాలలో కూడా యంగ్‌లుక్‌తో పాటు ముసలి గెటప్‌లలో కూడా కనిపిస్తూ, వాటిని కూడా ప్రేక్షకులకు అలవాటు చేయాలని భావించినా మన ప్రేక్షకులు మాత్రం మాకు యంగ్‌ రజనీనే కావాలని కోరుకుంటున్నారని ఆయన సినిమా ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తుంది. 

ఇక తాజాగా వస్తోన్న ‘పేట’ చిత్రంలో కూడా రజనీ తన వయసుకు తగ్గట్టుగా యంగ్‌ హీరోయిన్లతో కాకుండా త్రిష, సిమ్రాన్‌ వంటి వారితోనే జతకడుతున్నాడు. ఇందులో మరీ ‘కబాలి, కాలా’లా కాకపోయినా కాస్త ముసలి ఛాయలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఈసారైనా ప్రేక్షకులు రజనీని అలా చూసేందుకు ఇష్టపడతారా? లేదా? అనేది ఈ చిత్రం ఫలితంపై ఆధారపడి ఉంది. ఏమైనా తేడా వస్తే మాత్రం రజనీ పునరాలోచనలో పడటం ఖాయమనే చెప్పాలి. 

ఇక ‘బాషా’ చిత్రంలో రజనీ ఆటోడ్రైవర్‌గా కాలం గడిపే మాఫియా డాన్‌ పాత్రను పోషించగా, ‘పేట’లో కూడా దాదాపు అదే స్టైల్‌లో హాస్టల్‌ వార్డన్‌గా కాలం గడిపే మాఫియా డాన్‌గా నటించనున్నాడు. మరి ఈ సారైనా రజనీ తన సత్తా చాటుతాడో లేదో చూడాల్సివుంది...! 



By January 05, 2019 at 07:14AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44168/rajinikanth.html

No comments