Breaking News

కన్‌ఫ్యూజన్‌లో రౌడీస్టార్‌..!


రౌడీస్టార్‌, సంచలన హీరో, తెలంగాణ పవర్‌స్టార్‌గా అతి తక్కువ చిత్రాలతోనే ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా యూత్‌, అమ్మాయిలలో తనకంటూ విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ఇటీవల ఆయన మాట్లాడుతూ, తానేమీ కొత్త దర్శకులను ఎంకరేజ్‌ చేయడం లేదని, వారే తనని ఎంకరేజ్‌ చేస్తూ తమ ప్రతిభ పాటవాలతో నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమని చెప్పాడు. ఇక విషయానికి వస్తే విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం భరత్‌కమ్మ దర్శకత్వంలో ‘డియర్‌ కామ్రేడ్‌’లో నటిస్తున్నాడు. ‘డియర్‌ కామ్రేడ్‌’ అనే పదం విప్లవకారులు, కమ్యూనిస్ట్‌లు, కార్మికులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. 

తాజాగా విజయ్‌ దేవరకొండకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో పక్కన కొద్ది మందితో విజయ్‌ కార్మికులు ధరించే ఖాకీ డ్రస్‌ వేసుకుని కార్మిక నాయకునిగా కనిపిస్తున్నాడు. మరి ఈ వీడియోలో కనిపించే విజయ్‌కి సంబంధించిన వాటిల్లో ఈ లుక్‌ ఏ చిత్రం ఏ చిత్రంలోది అనే ఆసక్తి కలుగుతోంది. ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో విజయ్‌ ఓ విద్యార్ధి నాయకునిగా కనిపించనున్నాడు. ఇంతకు ముందు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో విజయ్‌ దేవరకొండ గెటప్‌కి దీనికి సంబంధం కనిపించడం లేదు. 

మరోవైపు విజయ్‌ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని సుప్రసిద్ద నిర్మాత కె.యస్‌.రామారావు నిర్మాణంలో ‘ఓనమాలు, మళ్లీమళ్లీ ఇది రానిరోజు’ వంటి సెన్సిబుల్‌ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్‌తో చేయనున్నాడు. ఈ చిత్రం సింగరేణి బొగ్గు గనులు, కార్మికుల నేపధ్యంలో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో విజయ్‌ పవర్‌ఫుల్‌గా ఉండే కార్మిక నాయకునిగా కనిపిస్తాడని అంటున్నారు. 

మరి ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్న వీడియోలో విజయ్‌ దేవరకొండ కార్మిక దుస్తుల్లో కనిపించే చిత్రం ఏది? అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ‘డియర్‌ కామ్రేడ్‌’లో విద్యార్ధినాయకుని గానే కాదు... కార్మిక నాయకునిగా కనిపించనున్నాడని, కాబట్టి తాజాగా విడుదలైన వీడియోలోని విజయ్‌ లుక్‌ డియర్‌ కామ్రేడ్‌లోనిదే అనే వాదన కూడా వినిపిస్తోంది. 



By January 31, 2019 at 12:40PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44510/vijay-deverakonda.html

No comments