‘మహానాయకుడు’పై ఈ వార్తలేంటి?
బాలకృష్ణతో పాటుగా నందమూరి అభిమానులు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో పెద్ద హిట్ అవుతుంది అనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా హిట్ అయ్యింది. కానీ ఏం లాభం కలెక్షన్స్ రాలేదు. అయితే కథానాయకుడు సినిమా విడుదలకు ముందు కథానాయకుడు సినిమాలో ఏం చూపిస్తారు.. అనే క్యూరియాసిటీ అయితే కాస్త తక్కువగానే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ నట జీవితం అంట క్లిన్ గా ఉండడం.. అలాగే సినిమాకి క్లిన్ యు సర్టిఫికెట్ రావడంతో.. సినిమా మీద మరి ఎక్కువ ఆసక్తి జనంలో లేకపోవడం కూడా సినిమా కలెక్షన్స్ తగ్గడానికి ఒక కారణం. అయితే గత ఐదారు నెలలుగా ఎన్టీఆర్ బయోపిక్ గురించి మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ లేదంటే.. సినిమాలోని ఏదో ఒక పోస్టర్ మీడియాలో కనబడేది.
కానీ కథానాయకుడు విడుదలై మహానాయకుడు సినిమా విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ.... మహానాయకుడు సినిమా విషయాలేమి మీడియాలో వినబడితే ఒట్టు. దర్శకుడు క్రిష్ మణికర్ణిక విషయమై కథలు కథలుగా మీడియాకి వివరిస్తున్నాడు కానీ.. ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్ రాకపోవడానికి... మహానాయకుడు విడుదల విషయం మాత్రం మాట్లాడడం లేదు. అదే గనక కథానాయకుడు హిట్ అయితే మహానాయకుడు పబ్లిసిటీ ఎప్పుడో మొదలయ్యేది. ఇక సినిమాలో చూపించబోయే విషయాల గురించి మీడియాలో ఎక్కడా ఎలాంటి న్యూస్ వినబడ్డం లేదు. కేవలం మహానాయకుడు విడుదల డేట్ పై మహానాయకుడు టీం క్లారిటీ ఇవ్వడం లేదని మాత్రం మీడియాలో వినిపిస్తుంది.
అలాగే మహానాయకుడు సినిమాలోని ఎన్టీఆర్ కి సన్నిహిత పొలిటీషియన్ లుక్స్ కూడా మీడియాకి వదులుతుంటే.. సినిమా మీద హైప్ క్రియేట్ అవుతుంది. అసలు మహానాయకుడు సినిమాలో కాంట్రవర్సీలను, ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో సంభవించిన పెను మార్పులను క్రిష్, బాలకృష్ణలు ఎలా చూపెడతారో తెలియదు కానీ.. ప్రస్తుతం కథానాయకుడుతో దెబ్బతిన్న బయ్యర్లకు మహానాయకుడు సినిమాని ఫ్రీగా ఇచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మహానాయకుడు సినిమా విడుదలపై కూడా క్రిష్ అండ్ బాలకృష్ణలు స్పందిస్తే... జనాలకు ఒక క్లారిటీ వస్తుంది. లేదంటే మహానాయకుడు మీదున్న ఇంప్రెషన్ మాత్రం తగ్గడం ఖాయం.
By January 30, 2019 at 08:53AM
No comments