Breaking News

అసలు రోజా ఫుల్ టైమ్ పొలిటీషియనేనా?


ఒకప్పుడు గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్ గా సత్తా చాటిన రోజా సెల్వమణి.. తాజాగా రాజకీయాలతోనూ బిజీ అయ్యింది. తెలుగు దేశంలో చేరిన రోజా నగరి ఎమ్యెల్యే అభ్యర్థిగా ఓడిపోయి... జగన్ ఆధ్వర్యంలో వైసిపిలో చేరి తర్వాత అక్కడ నగరి నుండి ఎమ్యెల్యే గా ఎన్నికైంది. ఎమ్యెల్యేగా ప్రజలకు చేరువలో ఉంటూనే వైసిపిలో కీలక పాత్ర పోషిస్తుంది. జగన్ ని అన్నా అంటూ సంబోధించడమే కాదు...  టిడిపి నాయకులను తన మాటల తూటాలతో చీల్చి చెండాడింది. అయితే కేవలం రాజకీయాలే కాదు.. డబ్బులు కావాలంటే టివి షోస్ కూడా చెయ్యాలని చెబుతుంటుంది రోజా.

అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో.. రాజకీయాలతో బిజీ కావాల్సిన రోజా ప్రస్తుతం టివి షోస్ తో బిజీ అవడం మాత్రం కాస్త షాకిస్తుంది. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న ఈటివి జబర్దస్త్ కి జెడ్జ్ గా, జీ ఛానల్ లో వివాదస్పదంగా ఉన్న బతుకుజట్కాబండి వ్యాఖ్యాతగా... జెమిని ఛానల్ లో రంగస్థలం డాన్స్ షో కి జెడ్జ్ గా వ్యవహరిస్తున్న రోజా... చాలా టివి షోస్ కి జెడ్జ్ గా, వ్యాఖ్యాత కూడా చేసింది. మరి ఇలా టివి షోస్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ రాజకీయాలను రోజా నిర్లక్ష్యం చేస్తుందా అంటే.. అక్కడ కూడా బాగా యాక్టీవ్ గానే ఉంటుంది.

ఇక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలలో బోలెడంత బిజీ కావాల్సి ఉంటుంది. ప్రజలకు అనుక్షణం టచ్ లో ఉండాలి. కానీ రోజా మాత్రం ఇప్పుడు జెమిని ఛానల్ లో మరో కొత్త షోతో ప్రేక్షకులముందుకు రాబోతుంది. ప్రజలను అప్రమత్తం చేసే షోలా కనబడుతున్న ఆ షో పేరు తస్మాత్ జాగ్రత్త. సమాజంలో జరుగుతున్న దొంగతనాలు, హత్యలు, అత్యాచారాల మీద ఏమన్నా ఈ షో సాగుతుందేమో.. అందుకే ఈ షోకి తస్మాత్ జాగ్రత్త అనే టైటిల్ పెట్టారు. త్వరలోనే రోజా ఆధ్వర్యంలో ఈ షో జెమిని ఛానల్ లో ప్రసారం కాబోతుంది. ఇక రోజా గతంలోనూ జెమిని ఛానల్ లో రచ్చబండ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి డబ్బు కోసం షో చేస్తుంటే... రాజకీయాలపై పూర్తి దృష్టి సారించడం కష్టమేమో ఆలోచించు రోజమ్మా...!



By January 29, 2019 at 10:19AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44482/roja.html

No comments