కియారాకు.. మరో స్టార్ చిత్రంలో ఛాన్స్..!
మహేష్.. ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నార్త్ బ్యూటీ కైరా అద్వానీ ఒకపక్క బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగులో వరస సినిమాలని ఓకే చేస్తుంది. రీసెంట్‌గా ఆమె నటించిన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది.
యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న కైరా కు టాలీవుడ్ నుండి మరో ఆఫర్ వచ్చింది. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమాలో ఈమె హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. ఎప్పటినుండో బన్నీ తన నెక్స్ట్ మూవీ ఏంటో అనేది సస్పెన్స్ లోనే ఉంచాడు. మూడు రోజులు కిందట ఆ సస్పెన్స్ కు తెర దించుతూ అధికార ప్రకటన చేసాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చకచకా చేస్తున్న త్రివిక్రమ్ త్వరలోనే ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లి దసరాకి రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు. ఇందులో హీరోయిన్ పాత్ర కథలో కీలకమని తెలుస్తోంది. అందుకే కైరా డేట్స్ కూడా మాట్లాడుకుంటే బెటర్ అని త్రివిక్రమ్ టీమ్ ఆమెతో చర్చలు జరిపినట్లు టాక్. మరి ఆమె ఓకే చెప్పిందో లేదో ఇంకా తెలియాల్సిఉంది. ఏదిఏమైనా అమ్మడుకి టాలీవుడ్ తెగ కలిసొచ్చేస్తుంది.
By January 04, 2019 at 08:57AM
No comments