Breaking News

క్రిష్ వదిలేస్తే హిట్.. తేజ వదిలేస్తే..?


ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ దర్శకత్వం మీద హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్ సినిమా మొత్తం డైరెక్ట్ చేస్తే.. చిన్న చిన్న రీ షూట్స్ చేసిన హీరోయిన్ కంగనా.. డైరెక్టర్‌గా టైటిల్ కార్డు‌లో తన పేరు వేసుకోవడాన్ని దర్శకుడు క్రిష్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మణికర్ణిక సినిమా విడుదలయ్యాక తన ఆవేదనను పూర్తి స్థాయిలో వెళ్లగక్కాడు క్రిష్. అదలా ఉంటే.. టాలీవుడ్‌లో తేజ దర్శకత్వం చేయాల్సిన సినిమాకి దర్శకుడు క్రిష్ డైరెక్షన్ చేసాడు. అదే ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుండి మొదట్లోనే దర్శకుడు తేజ తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్లేస్‌లోకి క్రిష్ వచ్చాడు.

ఇక ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలై సూపర్ హిట్ టాకొచ్చినా.. కలెక్షన్స్ మాత్రం పూర్ గా ఉన్నాయి. అయితే మొదట్లో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ కథానాయకుడిని బాగా డైరెక్ట్ చేశాడంటూ పొగిడారు. తాజాగా కథానాయకుడు ఎలెక్షన్స్ చూసి మొదటగా డైరెక్షన్ లిస్ట్‌లో ఉన్న తేజ ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్ట్ చేసి ఉంటే.. ఫలితం ఎలా ఉండేదో అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఒక షెడ్యూల్ షూటింగ్ చేసిన తేజ బయోపిక్ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. అయితే చిన్నపాటి షెడ్యూల్ చేసిన తేజ దర్శకత్వాన్ని పక్కనబెట్టి క్రిష్ మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని మొదటినుండి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే మొదట్లో డైరెక్టర్ గా ఉన్న తేజ మాత్రం ఎన్టీఆర్ కథానాయకుడు ఇంతవరకు వీక్షించలేదట.

తాను డైరెక్ట్ చేస్తున్న సీత సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వలన తాను కథానాయకుడు చూడలేదని చెబుతున్నాడు. అందుకే సినిమా మీద తానేమి కామెంట్ చెయ్యలేదని చెబుతున్నాడు తేజ. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎమోషనల్ అండ్ కామెడీ డ్రామా మిస్ అయ్యిందని వస్తున్న వార్తలకు తేజ క్లారిటీ లేని సమాధానం ఇచ్చాడు. అలాంటివి మిస్ అవడం అనేది దర్శకుడు శక్తి సామర్ధ్యాల మీద ఆధారపడి ఉంటుందని.. అలాంటివి చెయ్యాలంటే డైరెక్టర్ మైండ్ షార్ప్ గా ఉండాలని చెప్పాడు తేజ. మరి తేజ దృష్టిలో క్రిష్‌కి మైండ్ సరిగ్గా పనిచేసిందా.. లేదా అనేది ప్రేక్షకులే చెప్పాలి.



By January 29, 2019 at 07:05AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44478/manikarnika.html

No comments