సుక్కూకి సాయం చేసే ఆ స్టార్ హీరో ఎవరో?
టాలీవుడ్‌లో ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా సుకుమార్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈయన ఇటీవల సుకుమార్ రైటింగ్స్ పేరుతో చిన్న చిత్రాలను కూడా నిర్మిస్తున్నాడు. ఇటీవల మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్‌తో ఓ చిత్రాన్ని తన ప్రియ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్‌తో కలిసి ప్రారంభించాడు. ఈ వేడుకకు పవన్ తప్ప మెగా ఫ్యామిలీ హీరోలందరు హాజరయ్యారు. బుచ్చిబాబు, సుకుమార్‌లు కోనసీమకి చెందిన కోస్తా వాసులు కావడంతో ఈ మూవీని కూడా ‘రంగస్థలం’ తరహాలో గోదావరి నేపథ్యంలో తెరకెక్కించనున్నారు.
కాగా సుక్కు అంటే మన స్టార్స్‌కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఏదో ‘జగడం, ఆర్య2, 1’ (నేనొక్కడినే) వంటి ఫ్లాప్‌లు ఉన్నా కూడా తనని దర్శకుడిని చేసిన అల్లుఅర్జున్‌కి ‘ఆర్య’తో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాడు. వరుస పరాజయాలలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కి ‘నాన్నకు ప్రేమతో’ వంటి బ్లాక్‌బస్టర్‌ని, రామ్‌చరణ్‌లోని పూర్తి నటుడి విశ్వరూపాన్ని చూపుతూ ‘రంగస్థలం’ వంటివి అందించాడు. ఇక తన తదుపరి చిత్రంగా మహేష్‌బాబు 26 చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఒకవైపు సుక్కుకి స్టార్స్‌తో మంచి అనుబంధంతో పాటు మైత్రి మూవీ మేకర్స్‌కి కూడా అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి నేపధ్యంలో పంజా వైష్ణవ్ తేజ్‌తో నిర్మిస్తున్న మూవీలో ఓ కీలకపాత్రను పెద్ద స్టార్ చేత చేయించాలని, తద్వారా చిత్రానికి మంచి మైలేజ్ వస్తుందనేది సుక్కు నిర్ణయంగా తెలుస్తోంది.
మొదట వైష్ణవ్ తేజ్ అన్న సాయిధరమ్‌తేజ్‌ని ఇందుకోసం అనుకున్నా, వరుస ఫ్లాప్‌లలో తేజే ఉండటంతో ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నాడని తెలుస్తోంది. మెగా మేనల్లుడు కావడంతో మెగాఫ్యామిలీకే చెందిన రామ్‌చరణ్, బన్నీ పేర్లను ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నాడట. మరోవైపు చరణ్ రాజమౌళి చిత్రంతో బిజీగా ఉన్నాడు. బన్నీ త్రివిక్రమ్‌తో సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ బిజీగా మెగా ఫ్యామిలీ నుంచి అరంగేట్రం చేస్తోన్న ‘పంజా వైష్ణవ్ తేజ్’కి ఏ మెగాహీరో అండగా నిలుస్తాడో వేచిచూడాల్సివుంది...!
By January 29, 2019 at 05:24AM
No comments