Breaking News

పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న అలియాస్ జాన‌కి!


కెరీర్ బాగుంటే పెళ్లికి తొంద‌రేముంది అనే హీరోయిన్‌లు మ‌న ద‌గ్గ‌ర చాలా మందే వున్నారు. అదే కెరీర్ బాగా లేక‌పోయినా పెళ్లి ఊసే ఎత్త‌ని భామ‌ల సంఖ్యా ఎక్కువే. అయితే  ఓ యంగ్ హీరోయిన్ మాత్రం పెళ్లికి రెడీ అంటోంది. క్రేజీ క‌థానాయిక‌లంతా క్రేజ్‌లో వుండ‌గానే ఈ మ‌ధ్య పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డుతుండ‌టం న‌చ్చిందో ఏమోగానీ యంగ్ హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ త్వ‌ర‌లో పెళ్లికి ముస్తాబ‌వుతోంది. `అలియాస్ జాన‌కి` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ వైజాగ్ సుంద‌రికి ఆ త‌రువాత చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలేవీ త‌లుపుత‌ట్ట‌లేదు. 

`స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌`లో ప‌వ‌న్ ప‌క్క‌న అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోయింది. `గోపాల గోపాల‌` చిత్రంలో న‌టించినా అది ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌క్క‌న కాదు. ఓ జ‌ర్న‌లిస్టు పాత్ర‌. దాని వ‌ల్ల త‌న‌కు ఒరిగిందేమీ లేదు. పైగా పోగొట్టుకుందే ఎక్కువ‌.   ఆ త‌రువాత `మ‌న‌మంతా, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ, ఒక్క‌డు మిగిలాడు, వంశీ రూపొందించిన `ఫ్యాష‌న్ డిజైన‌ర్‌`, ఈ న‌గ‌రానికి ఏమైంది వంటి చిత్రాల్లో న‌టించినా ఎలాంటి ఫ‌లితం లేక‌పోయింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ అనీషా ఆంబ్రోస్ త‌న చ‌రికాల మిత్రుడిని పెళ్లాడాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిందట‌. 

  `ఈ న‌గ‌రానికి ఏమైంది` సినిమా త‌రువాత తెలుగులో చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్స్ ఏవీ లేని అనీషా ఆంబ్రోస్ పెళ్లి చేసుకుని సినిమాల‌కు గుడ్‌బై చెప్పాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే ఇరు కుటుంబాల‌కు చెందిన పెద్ద‌లు అనీషా పెళ్లికి గ్రీన్ సిగ్న్ ఇచ్చార‌ని, వ‌చ్చే నెల‌లోనే పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని తాజా స‌మాచారం. 



By January 26, 2019 at 03:00PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44435/anisha-abros.html

No comments