Breaking News

మెగాప్రిన్స్‌ను నిజంగా అభినందించాల్సిందే


కొత్తదనాన్ని నమ్మితే ఈ రోజు కాకపోయినా రేపైనా సక్సెస్‌లు వస్తాయనేది నిజం. ఈ విషయాన్ని నేచురల్‌స్టార్‌ నాని, రౌడీస్టార్‌ విజయ్‌దేవరకొండ, నిఖిల్‌ వంటి వారు నిరూపిస్తూనే ఉన్నారు. ఇక ఈ కోవలోకి చెందిన నటుడే మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌. మరోవైపు మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ ఊకదంపుడు చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటూ కాబోయే మెగాస్టార్‌ అంటూ ప్రశంసలు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏం బాగాలేదనుకోండి. కానీ వరుణ్‌తేజ్‌ మాత్రం కొత్తదనాన్నే నమ్ముకున్నాడు. అలా ఆయన డిఫరెంట్‌గా చేసిన ‘కంచె, ఫిదా, ఎఫ్‌2’లు మంచి విజయం సాధించాయి. కాస్త కొత్తగా రొటీన్‌ స్టోరీలుగా వచ్చిన ‘ముకుంద, లోఫర్‌’ డిజాస్టర్స్‌ అయ్యాయి.

ఇక ‘అంతరిక్షం’ చిత్రం పెద్ద హిట్‌ కాకపోయినా, ఫ్లాప్‌ అయినా కూడా ప్రయోగాత్మక చిత్రంలో నటించినందుకు వరుణ్‌కి మాత్రం ప్రశంసలే లభించాయి. ఇప్పుడు ఆయన ‘వాల్మీకి’ టైటిల్‌తో వస్తున్నాడు. ‘దబాంగ్‌’ని ‘గబ్బర్‌సింగ్‌’గా అద్భుతంగా మలిచిన హరీష్‌శంకర్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈయన పవన్‌తో ‘గబ్బర్‌సింగ్‌’, అల్లుఅర్జున్‌తో ‘డిజె’, సాయిధరమ్‌తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ వంటి చిత్రాలు తీసి మెగా కాంపౌండ్‌ దర్శకుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇక టైటిల్‌ విషయానికి వస్తే వాల్మీకి గురించి అందరికీ తెలిసిందే. 

ఆయన మొదట్లో బహు కిరాతకుడు. ఆ తర్వాత గొప్ప వ్యక్తిగా మారి ‘రామాయణం’ రచించాడు. దీనిని బట్టి ఈ చిత్రంలో హీరో కూడా నెగటివ్‌ షేడ్స్‌లో చాలా భాగం కనిపిస్తాడని, ఆ తర్వాత మార్పు చెంది మంచివాడు, ఆదర్శవంతుడిగా మారుతాడని అర్ధమవుతోంది. అయితే ఇది కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తమిళంలో సిద్దార్ద్‌, బాబీసింహా నటించిన ‘జిగర్తాండా’కి రీమేక్‌ అనే ప్రచారం సాగుతోంది. 

బాబీ సింహా పోషించిన క్రూరమైన విలన్‌ పాత్రను ఇందులో వరుణ్‌తేజ్‌ పోషించనున్నాడని వార్తలు వచ్చాయి. మరి ఈ విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’, ‘నేనేరాజు-నేనే మంత్రి’లో రానాలా నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరో పాత్రలు కూడా బాగా ఆడాయి. మరి వరుణ్‌తేజ్‌కి ఈ ఫలితం ఎలా ఉండనుందో వేచిచూడాలి. అయినా ఇంత తక్కువ వ్యవధిలోనే నెగటివ్‌ షేడ్స్‌ ఉండే పాత్రను చేస్తున్న వరుణ్‌తేజ్‌ని మాత్రం అభినందించి తీరాలి...! 



By January 30, 2019 at 07:51AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44489/varun-tej.html

No comments