Breaking News

పుకార్లను కొట్టేసిన అనసూయ..!


మొదట్లో కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చినా కూడా ఇద్దరు పిల్లలున్న అనసూయ ఆంటీలోని గ్లామర్‌ని వెలుగులోకి తీసుకుని వచ్చింది మాత్రం ‘జబర్దస్త్‌’షోనే అని చెప్పాలి. నిజానికి ‘జబర్దస్త్‌’ కే చెందిన మరో బ్యూటీ రష్మి ఇంకా పెళ్లికాని యువతే అయినా కూడా ఆమె కంటే మంచి గుర్తింపును ఇద్దరు పిల్లలున్న ఆంటీ అనసూయ దక్కించుకుంది. అతి తక్కువ సమయంలోనే తన పేరు మీదనే పాటను రాయించుకుని, స్పెషల్‌సాంగ్‌లో డ్యాన్స్‌ చేసింది. ఈమెకి నటిగా ‘క్షణం’ చిత్రం మంచి గుర్తింపును తీసుకుని వస్తే.. ‘రంగస్థలం’ చిత్రంలో మాత్రం ‘రంగమ్మ.. మంగమ్మ’ అంటూ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. 

కాగా ఈమె ప్రస్తుతం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సెమీ బయోపిక్‌గా రూపొందుతున్న ‘యాత్ర’ చిత్రంలో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాత్రను పోషిస్తోంది. దాంతో పాటు ఆమె కీలకపాత్రను పోషిస్తోన్న ‘కథనం’ చిత్రం ‘క్షణం’ తర్వాత మరలా ఆమెకి అంత గుర్తింపును తీసుకుని వస్తుందనే ప్రచారం సాగుతోంది. ‘కథనం’లో ఆమె పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను చేస్తోందని వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో నిజం లేదు. ఇందులో ఆమె డిఫరెంట్‌గా ఉండే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాత్రలో కనిపించనుంది. 

దీనితో పాటు తనని సోలో హీరోగా పరిచయం చేస్తూ ఘన విజయాన్ని అందించిన ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ రుణం తీర్చుకుంటూ రౌడీస్టార్‌ విజయ్‌ దేవరకొండ ఓ చిత్రం నిర్మించనున్నాడు. ఈ మూవీ నాలుగు పాత్రల చుట్టూ తిరగనుంది. ఈ నాలుగు పాత్రలో తరుణ్‌భాస్కర్‌, అనసూయలను రెండు కీలకపాత్ర కోసం తీసుకున్నారు. ఇందులో అనసూయ తరుణ్‌భాస్కర్‌ సరసన జోడీగా నటిస్తోందని, ఆమెది ఓ ఫుల్‌ రొమాంటిక్‌ పాత్ర అని, ఇప్పటి వరకు అనసూయ కనిపించిన దాని కంటే డబుల్‌ గ్లామర్‌షో ఇందులో ఉంటుందని ప్రచారం సాగుతోంది. 

తాజాగా ఈ వార్తలను అనసూయ కొట్టిపారేసింది. ఈ సినిమాలో నేను చేసేది రొమాంటిక్‌ పాత్ర కాదు. వేరే పాత్రలతో కూడా నాకు రొమాన్స్‌ ఉండదు. ఇది సినిమాలో కీలకమైన పాత్ర అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నా కెరీర్‌కి ఈ చిత్రం ఎంతో హెల్ప్‌ అవుతుంది. మిగిలిన విషయాలను తర్వాత తెలుపుతానని క్లారిటీ ఇచ్చింది. దీనిని బట్టి గ్లామర్‌షో ద్వారా కాకుండా మరోసారి ‘క్షణం’ మాదిరే తనలోని నటనాసత్తాని చాటే చిత్రంగా ఇది అనసూయకి ఉండబోతోందని అర్ధమవుతోంది. ఇక ఈ చిత్రం దర్శకుడు ఎవరు? అనే విషయంలో మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది.



By February 01, 2019 at 06:29AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44523/anasuya.html

No comments