ప్రభాస్ లుక్‌పై ఎందుకలా కామెంట్స్..!
సినిమా రంగంలో అంటే షష్టిపూర్తి పూర్తి చేసుకున్న వారు కూడా తమ లుక్, ఫిజిక్ వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అందునా స్టార్ హీరోలకు అది తప్పనిసరి. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, మరీ ముఖ్యంగా నాగార్జున వంటి వారు తాతయ్యలు అయినా మామయ్యలు అయినా ఇప్పటికీ యంగ్‌లుక్‌లోనే కనిపించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత మరలా వెండితెరకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీనెంబర్ 150’ లుక్‌లో కూడా పెద్దగా తేడా లేదు.
అంతెందుకు ‘సై..రా...నరసింహారెడ్డి’లో ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పాత్రలో స్వాతంత్య్ర సమరయోధునిగా చిరు నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం స్లిమ్‌గా తయారై, ఏమాత్రం ఎక్సర్‌సైజ్‌ల వల్ల మొహం పీక్కుపోకుండా చిరంజీవి పడుతున్న శ్రమ తాజాగా ‘వినయ విధేయ రామ’ ప్రీరిలీజ్ వేడుకకు వచ్చిన ఆయనను చూస్తే అర్ధమవుతోంది. ఈవేడుకకు వచ్చిన వారే కాదు.. స్వయానా ముఖ్యఅతిథిగా వచ్చిన తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం చిరు, చరణ్‌లు పక్కనపక్కనే ఉంటే అచ్చు అన్నదమ్ముల్లా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చాడు.
ఇక నాగార్జున, 45 ఏళ్లు వచ్చిన మహేష్‌బాబు వంటి వారు తమ లుక్, ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ యంగ్‌రెబెల్‌స్టార్‌గా ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుని, హీమ్యాన్‌గా దేశవిదేశాలలో ఐకాన్‌గా మారిన ప్రభాస్ తాజా లుక్‌పై మాత్రం విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహ వేడుకలో కనిపించాడు. కానీ అక్కడ కనిపించిన ఆయన లుక్స్‌పై విమర్శలు వస్తున్నాయి.
బొద్దుగా ఉన్న మొహం, మొహంలో ముదురుతనం, హెయిర్‌స్టైల్.. ఇలా ఏవీ ఆకర్షణీయంగా లేవు. మరి ‘సాహో’తోపాటు జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘జాన్’ (వర్కింగ్ టైటిల్)లో కూడా ఇదే లుక్‌తో కనిపిస్తాడా? అనే అనుమానం కలుగుతోంది. మేకప్‌తో ఎంత కవర్ చేయాలని భావించినా ఆయన ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ విషయంలో ఆయన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ని ఆదర్శంగా తీసుకుంటే కానీ వీలు కాదని చెప్పాలి.
By January 04, 2019 at 09:22AM
No comments