Breaking News

విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగిందబ్బా..


తెలుగులో ప్రస్తుతం యంగ్‌స్టార్స్‌కి చుక్కలు చూపుతున్న వారిలో రౌడీ స్టార్‌, సెన్సేషనల్‌ స్టార్‌, తెలంగాణ మెగాస్టార్‌ అని అభిమానులు ముచ్చటగా పిలుచుకుంటున్న విజయ్‌దేవరకొండది ప్రత్యేకస్థానం. ఈయన రాకతో మాస్‌మహారాజా రవితేజ, రామ్‌, నితిన్‌, నిఖిల్‌, నాగశౌర్య, నాగచైతన్య, శర్వానంద్‌ వంటి వారే కాదు.. వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, నాని వరకు నిద్రపట్టడం లేదు. ఎలాంటి ఫిల్మ్‌ బ్యాగ్రౌండ్‌ లేకపోయినా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ‘ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు’ మరీ ముఖ్యంగా ‘అర్జున్‌రెడ్డి, గీతగోవిందం, ట్యాక్సీవాలా’లతో తన సత్తా చాటాడు. 

‘మహానటి’లో చిన్న పాత్రని చేసి మెప్పించాడు. ‘నోటా’ ఒక్కటే ఆయనను డిజప్పాయింట్‌ చేసింది. ముఖ్యంగా ఆయనంటే యూత్‌, అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు. ఇదే సమయంలో విజయ్‌ కూడా ప్రభాస్‌, అల్లుఅర్జున్‌, ప్రభాస్‌ల వలే బహుభాషలపై దృష్టి పెడుతున్నాడు. ఇందులో భాగంగానే ఈయన తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా ‘నోటా’ చేసి పరాజయం పొందాడు. కానీ ఆయన తాను పట్టిన పట్టుని మాత్రం వదలడం లేదు. తాజాగా ఓ తమిళ కొత్తదర్శకుడు చెప్పిన పాయింట్‌ యూనివర్శల్‌గా ఉండటంతో రెండు భాషల్లో దీనిని తీయడానికి ఓకే చెప్పాడట. 

ఇక ట్యాక్సీచుట్టూ తిరిగే కథతో ‘ట్యాక్సీవాలా’లో మెప్పించిన ఆయన తాజాగా ‘బైక్‌’ చుట్టూ తిరిగే కథను ఓకే చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘డియర్‌ కామ్రేడ్‌’లో నటిస్తున్నాడు. దీనితర్వాత కె.యస్‌.రామారావు-క్రాంతిమాధవ్‌ల మూవీకి ఓకే చెప్పాడు. మైత్రిమూవీమేకర్స్‌, దిల్‌రాజు బేనర్లలో కూడా చిత్రాలు ఉన్నాయి. ఇక ఈయన ‘గీతా గోవిందం’ ముందు కోటి దాకా రెమ్యూనరేషన్‌ తీసుకునే వాడు. కానీ ఇటీవల ఆయన దానికి పదిరెట్లు అధికంగా 10కోట్లు డిమాండ్‌ చేస్తున్నాడట. 

ఆమధ్య ఆయన పారితోషికం పెంపుపై వార్తలు వస్తే నో చెప్పాడు. కానీ దిల్‌రాజు, మైత్రీమూవీమేకర్స్‌, కె.యస్‌.రామారావు చిత్రాలన్నింటికీ ఆయన 10కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మరోవైపు మైత్రిమూవీమేకర్స్‌ వారు విజయ్‌తో వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో చిత్రం చేయాలని భావించారు. కానీ ‘మిస్టర్‌ మజ్ను’ విషయంలో దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ ఇలా అన్నిటా విఫలమైన వెంకీకి మైత్రి, విజయ్‌లు చాన్స్‌ ఇస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 



By January 29, 2019 at 06:33AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44477/vijay-deverakonda.html

No comments