Breaking News

బయోపిక్ సెట్స్‌లో బాలయ్య అసహనానికి కారణం!


సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ప్లాప్ వరసలో మొదటగా నిలిచిన సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు. సినిమా హిట్.. కలెక్షన్స్ ప్లాప్. బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో అన్నట్టుగా కథానాయకుడు సినిమా ప్లాప్ అయ్యింది. బాలకృష్ణ ఎన్నో హోప్స్ పెట్టుకున్న కథానాయకుడు ఎన్టీఆర్ చరిత్రతో తెరకెక్కిస్తే చరిత్రలో కలిసిపోయింది అన్నట్టుగా ఉంది వ్యవహారం. నాన్నగారి బయోపిక్‌లో నటించడం, దాన్ని నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని కథానాయకుడు విడుదలకు ముందు విడుదల తర్వాత ఎన్నో స్పీచ్‌లిచ్చిన బాలకృష్ణ కథానాయకుడు రిజల్ట్‌కి వచ్చిన కలెక్షన్స్ చూసి మళ్లీ మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు.

కథానాయకుడు విడుదలైన రెండు మూడు రోజులు హుషారుగా ఛానల్స్ కి, మీడియాకి ఇంటర్వూస్ ఇచ్చిన బాలకృష్ణ కథానాయకుడు కి కలెక్షన్స్ పడిపోవడం మొదలెట్టాక మళ్ళీ కనిపించలేదు. అయితే పండగ అంటే సంక్రాంతి రోజున కూడా ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ మహానాయకుడు షూటింగ్ లో పాల్గొనడంతో బాలకృష్ణ కనిపించలేదు కానీ.. మరేదీ లేదని నందమూరి ఫ్యాన్స్ అంటున్నప్పటికీ... దర్శకుడు క్రిష్ మాత్రం మీడియాలో మణికర్ణిక గురించి తరుచూ మాట్లాడుతూనే ఉన్నాడుగా అంటూ అపోజిషన్ ఫ్యాన్స్ కౌంటర్ వేస్తున్నారు. అయితే బాలకృష్ణ కథానాయకుడు కొచ్చిన కలెక్షన్స్ మీద కాస్త అసహనంగా వున్నాడంటున్నారు.

అందుకే మహానాయకుడు షూటింగ్ సెట్ లో చిర్రు బుర్రులాడుతున్నాడని.. కథానాయకుడు విడుదలకు ముందు చాలా సాఫ్ట్‌గా వున్న బాలయ్య కలెక్షన్స్ దెబ్బకి చిరాకెత్తిందని.. అందులోను మహానాయకుడు థియేట్రికల్ రైట్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ కి ఫ్రీగా ఇస్తున్నారనే ప్రచారానికి బాలయ్య మండిపడుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. బాలకృష్ణ అంత అసహనానికి గురవడానికి కారణం.. కథానాయకుడు అనుకున్నట్టుగా హిట్ అయినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా దెబ్బేయ్యడం... అందులోను తనకి ఎంతో ఇష్టమైన ఎన్టీఆర్ బయోపిక్‌కే ఇలా జరగడంతో బాలయ్య బాధపడుతున్నాడట. అదే ఇంకో సినిమా అయితే బాలయ్యకి అంత బాధ ఉండేది కాదు కానీ.. ఎన్టీఆర్ బయోపిక్ అవడంతోనే ఇంత అవమానంగా బాలయ్య ఫీల్ అవుతున్నాడట.



By January 31, 2019 at 05:18AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44505/balakrishna.html

No comments