Breaking News

విభిన్న టైటిల్సేనా? హిట్ కొట్టేదేమన్నా ఉందా!


నందమూరి హీరోలలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ మంచి ఊపు మీదున్నాడు. అయితే హరికృష్ణ మరో తనయుడైన నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాత్రం ఎత్తుపల్లాలను అధిగమిస్తూ వస్తున్నాడు. ఈయన హీరోగా చేసిన చిత్రాలలో ‘అతనొక్కడే, హరేరామ్‌, పటాస్‌’లు తప్ప పెద్దగా చెప్పుకోదగిన చిత్రాలు ఏమీ లేవు. కానీ ఈయన మాత్రం యంగ్‌ డైరెక్టర్స్‌ని నమ్ముకుంటూ తానే నిర్మాతగా ఉంటూ పలు విభిన్నతరహా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ఇక ‘పటాస్‌’ ఈయనకు హీరోగా మంచి బ్రేక్‌నివ్వగా, నిర్మాతగా వస్తున్న వరుస పరాజయాలు, మరీ ముఖ్యంగా ‘కిక్‌ 2’ దెబ్బ నుంచి తమ్ముడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘జైలవకుశ’తో ఈయనను ఆర్ధికంగా ఒడ్డునపడేశాడు. 

ఇక ‘పటాస్‌’ తర్వాత కళ్యాణ్‌రామ్‌ నటించిన ‘ఇజం, ఎమ్మెల్యే, నా నువ్వే’ చిత్రాలు సరిగా ఆడలేదు. ఇలాంటి సమయంలో ఆయన గుహన్‌ దర్శకత్వంలో ‘118’ అనే విభిన్న టైటిల్‌, కాన్సెప్ట్‌లతో ఓ చిత్రం రూపొందుతోంది. పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈమూవీని వచ్చే ఏడాది ప్రధమార్ధంలో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌ టీజర్‌ విడుదలైంది. కళ్యాణ్‌రామ్‌, షాలినిపాండేకి సంబంధించిన విజువల్స్‌ మీదనే ఈ మూవీ టీజర్‌ని కట్‌ చేశారు. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న వారి జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం ఈ చిత్రం మెయిన్‌ కాన్సెప్ట్‌గా అర్థమవుతోంది. 

మరో హీరోయిన్‌గా నటిస్తున్న నివేదా థామస్‌ పాత్రని మాత్రం టీజర్‌లో ఎక్కడా రివీల్‌ చేయలేదు. టీజర్‌ మొత్తాన్ని సస్పెన్స్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తూ కట్‌ చేశారు. టైటిల్‌లానే విజువల్స్‌ కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ మూవీ కళ్యాణ్‌రామ్‌ని కొత్త యాంగిల్‌లో చూపించనుందనే నమ్మకం ఈ టీజర్‌ని చూస్తే అర్ధమవుతోంది. మరి ఈ మూవీ అయినా ఈ నందమూరి హీరోకి మంచి సక్సెస్‌ని అందిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది....! 



By December 19, 2018 at 05:41PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43924/kalyan-ram.html

No comments