Breaking News

బాలయ్య-బోయపాటి.. వినాయక్ ఏం చేశాడంటే?


మొన్నటివరకు బాలకృష్ణతో వినాయక్ సినిమా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ కూడా దాదాపు అయిపోయిందని త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుందని వార్తలు వచ్చాయి. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా వినాయక్‌కి మంచి పేరు వుంది. బాలకృష్ణ‌తో మరో మాస్ సినిమా తీయబోతున్నాడని సమాచారం జరిగింది.

కానీ చివరికి బాలకృష్ణ.. బోయపాటితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఏమైందో ఏమోకానీ ‘ఎన్టీఆర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు అధికారంగా ప్రకటించారు. వినాయక్ కూడా ‘ఇంటిలిజెంట్’ సినిమా తరువాత ఇంతవరకు సినిమా కమిట్ అవ్వకుండా బాలయ్య పైనే హోప్స్ పెట్టుకున్నాడు. సడెన్‌గా బాలయ్య హ్యాండ్ ఇవ్వడంతో.. బాలయ్యకు అనుకున్న కథని ఇప్పుడు వినాయక్ మరో హీరోకి వినిపించాడట.

బాలకృష్ణ కోసం రెడీ చేసుకున్న కథ‌ను వెంకటేశ్‌కి వినిపించాడట వినాయక్. కథ విన్న వెంకీ సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే వెంకీ ఓకే చెప్పేయడం ఖాయమని అంటున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో ‘లక్ష్మీ’ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.



By December 31, 2018 at 05:20AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44090/balakrishna.html

No comments