Breaking News

`సాహో` రిలీజ్ డేట్ ని లాక్ చేశారు!


`బాహుబ‌లి` సిరీస్ చిత్రాల‌తో యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స్థాయి పెరిగిన పోయింది. ఈ సినిమా త‌రువాత త‌న నుంచి మ‌రో చిత్రం వస్తోందంటే అంచ‌నాలు భారీగా వుంటాయ‌ని ఊహించిన ప్ర‌భాస్ అందుకు త‌గ్గ క‌థ‌నే ఎంచుకుని సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `సాహో`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. `బాహుబ‌లి`తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్ర‌భాస్ త‌న క్రేజ్‌కు త‌గ్గ క‌థల్నే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ నుంచి సినిమా వ‌చ్చి చాలా రోజుల‌వుతోంది. ప్ర‌భాస్ న‌టిస్తున్న `సాహో`  ఎప్పుడొస్తుందా ? అని  ప్రేక్ష‌కులు గ‌త కొంత కాలంగా వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్ష‌ణ ఫ‌లించే టైమొచ్చింది. 

దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో `సాహో` చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది.  తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఎప్పుడు విడుద‌ల‌వుతుందా అని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఆ ఉత్కంఠ‌కు తెర‌తీస్తూ చిత్ర బృందం ఈ చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌న‌ట్లు తెలిసింది. `బాహుబ‌లి` త‌రువాత భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్నఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 15న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు చిత్ర పీఆర్వో సోమ‌వారం ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించేశాడు. 

తొలుత ఈ చిత్రాన్నివ‌చ్చే ఏడాది  ఏప్రిల్ లో విడుద‌ల చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత ఆగ‌స్టు 9న రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని నిర్మాత‌ల్లో చ‌ర్చ జ‌రిగింద‌ట‌. చివ‌రికి ఆగ‌స్టు 15నే విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు డేట్ ఫిక్స్ చేసుకున్న‌ట్లు పీఆర్వో ఎస్‌కెఎన్ ట్వీట్‌తో తేలిపోయింది. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో దుబాయ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఛేజింగ్ స‌న్నివేశాల్నిఇటీవ‌లే చిత్రీక‌రించారు. ఇవి సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిల‌వ‌నున్నాయి. బాలీవుడ్ హాట్ లేడీ శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, అరుణ్ విజ‌య్‌, చుంకీ పాండే, జాకీష్రాఫ్, మందిరా బేడీ, టినూ ఆనంద్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్, ముర‌ళీశ‌ర్మ‌, సీఐడీ ఫేమ్ ఆదిత్య శ్రీ‌వాస్త‌వ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాతో ప్ర‌భాస్ మార్కెట్ స్థాయి మ‌రింత విస్త‌రించే అవ‌కాశం వుంది.  



By December 18, 2018 at 07:36AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43900/sahoo.html

No comments