Breaking News

ఈసారి కమలే కాదు.. కాజల్ కూడా..!!


స్టార్ హీరో కమల్‌హాసన్ - గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ అప్పటిలో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ ను తెరకెక్కించనున్నాడు డైరెక్టర్ శంకర్. ‘భారతీయుడు 2’గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

‘భారతీయుడు’లో సీనియర్ కమల్‌హాసన్.. లంచం తీసుకునే వారిపై ఒక ప్రాచీన యుద్ధ విద్యను ప్రయోగించి మట్టి కరిపిస్తుంటాడు. అయితే ఇప్పుడొచ్చే సీక్వెల్‌లో కూడా మరో ప్రాచీన యుద్ధ విద్యను శంకర్ చూపించబోతున్నాడట. భారతీయుడులో ‘మర్మకళ’(తెలుగులో వర్మకళ)ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే సీక్వెల్‌లో దీనికంటే చాలా బలమైన కళను శంకర్ చూపించబోతున్నట్లుగా టాక్.

కమల్‌హాసన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిసున్న ఈ చిత్రంలో విశేషం ఏమిటంటే.. ఈ కొత్తకళను కమల్‌తో పాటు కాజల్ కూడా ప్రయోగించే సన్నివేశాలు ఉంటాయట. ఆ కళకు సంబంధించి కాజల్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటుందట. సో త్వరలోనే కాజల్‌ను మరో యాంగిల్‌లో చూడనున్నారు తన ఫ్యాన్స్. జనవరి‌లో సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.



By December 20, 2018 at 06:24AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43933/kajal-agarwal.html

No comments