Breaking News

విజయ్ దేవరకొండ.. మినిమమ్ కోటి ఉంటేనే!


ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలు తప్పనిస్తే.. మోస్ట్ క్రేజియస్ట్ హీరో ఎవరు అంటే వెంటనే విజయ్ దేవరకొండ పేరే చెబుతారు. స్టార్ హీరోలకు కూడా సాధ్యంకాని... ఫీట్‌ని విజయ్ దేవరకొండ హీరోగా మారిన అతి కొద్ది సమయంలోనే సంపాదించాడు. మధ్యమధ్యలో చిన్న చిన్న ప్లాప్స్ వచ్చినప్పటికీ... భారీ హిట్స్ తో ఇండస్ట్రీనే కాదు.. యూత్ ని కూడా తనవైపు తిప్పేసుకున్నాడు. ప్రస్తుతం ఫుల్ క్రేజ్‌లో ఉన్న విజయ్ దేవరకొండ బ్రాండ్ వేల్యూ వీర లెవల్లో ఉంది. సినిమాలలో టాప్‌లో ఉండే నటీనటులు సినిమాల్లో అవకాశాలు, క్రేజ్ ఉన్నప్పుడే చేతినిండా సంపాదించాలనే కాన్సెప్ట్ ఎప్పటినుండో ఉంది. అలాగే తారలు క్రేజ్‌ని బట్టి పలు కంపెనీలు తమ తమ బ్రాండ్‌కి బ్రాండ్ అంబాసిడర్లు‌గా తీసుకుంటారు.

ఇప్పటికే సూపర్‌స్టార్ మహెష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. హీరోయిన్స్ సరేసరి రెండు చేతులా సంపాదిస్తున్నారు. తాజాగా విజయ్ కూడా స్టార్స్ సరసన చేరిపోయాడు. అర్జున్ రెడ్డి హిట్ కే.. కెఎమ్ఎల్ ఫ్యాషన్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన విజయ్ తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌‌కి కూడా బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఇక సినిమాల్లో 6 నుండి 8 కోట్ల పారితోషకము డిమాండ్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ బ్రాండ్స్‌తో తెగ సంపాదించేస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ చేతిలో మరో క్రేజీ బ్రాండ్ పడిందట. సౌత్ ఇండియా నుంచి ఫ్లిప్‌కార్ట్.. తమ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌ల‌తో పాటు ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని కూడా తీసుకుందట.

మరి ఫ్లిప్‌కార్ట్ తో విజయ్ ఒప్పందం విలువ ఎంతో తెలుసా.. అక్షరాలా కోటి రూపాయలట. విజయ్‌తో మరే కంపెనీ డీల్ చేయాలన్నా.. మినిమం కోటి చూసుకోవాలి. మరి సినిమాల్లోనూ, బ్రాండ్స్ విషయంలోనూ విజయ్ దేవరకొండ స్పీడు మాములుగా లేదు. అతి తక్కువ సమయంలోనే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పడానికి ఇదే నిదర్శనం.



By December 18, 2018 at 04:32AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43894/vijay-devarakonda.html

No comments