Breaking News

మహేష్ బాబు ఏ తప్పూ చేయలేదు: లీగల్ టీం


జిఎస్‌టి కమిషనరేట్, హైదరాబాద్ వారు, కోర్ట్ పరిధిలో ఉన్న 18 లక్షల 50 వేల రూపాయల  పన్నుని వడ్డీతో కలిపి  73 లక్షల 50 వేలుగా నిర్ణయించి బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించారు. 2007 - 08 ఆర్ధిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్‌కి ఈ పన్ను చెల్లించాలని వారు నిర్ణయించారు. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి టాక్స్ పరిధిలోకి రాదు. అంబాసిడర్ సర్వీసెస్‌ని టాక్స్ పరిధిలోకి సెక్షన్ 65 (105) (zzzzq ) ద్వారా 01 -07 -2010 నుండి చేర్చడం జరిగింది. టాక్స్ పేయర్ చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం ఇంకా కోర్ట్ పరిధిలో ఉన్నప్పటికీ జి‌ఎస్‌టి కమిషనరేట్ బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించడం జరిగింది. మహేష్ బాబు చట్టానికి కట్టుబడే పౌరునిగా తన పన్నులన్నిటినీ సక్రమంగా చెల్లించారు. 

-- లీగల్ టీం ఆఫ్ జి.మహేష్ బాబు



By December 29, 2018 at 10:31AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44068/mahesh-babu.html

No comments